Avirbhava Publishing House - Avirbhava Paksha Patrika 31st Edition May 5th 2021
సమాలోచన జనజాగృతి లోపించిన భారత కరోనా పోరాటం నేటి భారతం అత్యంత క్లిష్టమైన పరిస్థితులతో పోరాడుతూ ఉంది . యావత్ ప్రపంచపు లోగిళ్ళకు కొద్ది కాలం కింద వ్యాక్సిన్ అందించిన భారత్ ఈ నాడు అదే వ్యాక్సిన్, ఆక్సిజన్ కొరతతో సతమతమౌతుంది. ఇది నాణ్యనికి ఓ వైపు కధ అయితే మరో వైపు భయంకర నిజం ఒకటి దాగి ఉంది, అది మనల్ని ఆలోచింప చేయాల్సింది. ఏ పోరుకైనా అవగాహనతో బాధ్యతగా చేయగలిగితే విజయం మనదే అవుతుంది, ఇది నూరు శాతం నిజం, కానీ ఈ పరిస్థితులలో మనం కరోనా పోరులో చాలావరకు బాధ్యతారహితంగానే పనులు చేస్తున్నాము అన్నది నిలువెత్తు నిజం. ఉదాహరణకి జరుగుతున్న వ్యాక్సినేషన్ గురించి ఎన్నో అపవాదులు ప్రచారంలో ఉన్నాయి, వ్యాక్సిన్ వేయించుకుంటే మన ఆరోగ్యానికి ప్రమాదం అని, అది కాక కోవిడ్ నియంత్రణకు పెట్టే ఏ ఒక్క చర్యని పాటించకపోవటం, ఇలాంటివెన్నో ఈ నాడు కరోణా విచ్చలవిడిగా విజృంభణకు కారణాలుగా నిలిచాయి . ఈ నాడు కరోనా గురించి ప్రచారంలో ఉన్న విషయాల్లో చాలా వరకు వదంతులు అనే చెప్పవచ్చు. వాటిని ప్రచారంలో ఉండనిచ్చి మనం లేని సమస్యలని పెంచుకుంటున్నాము . కొన్ని ప్రాంతాలలో కరోనా వచ్చిన కుటుంబాలను వెలివేసిన వార్తలు కూడా మనకు వినికిడిలో ఉన్నా మనం పట్టనట్లు ప్రవర్తిస్తున్నాము. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి అధికారులు పెట్టిన ఎన్నో కట్టడులు మనం విని విననట్లు వదిలేయటం వలన వ్యాప్తి ఆగక ఇంకా ప్రచండరూపం దాల్చిన నిజాన్ని మనం మరచి, ఇది మన సమస్య కాదు సర్కారుది అన్నట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటే అది బాధ్యతలేని ప్రవర్తనే అన్నది నిజం . పెద్ద చదువులు చదివిన మహనీయులు కూడా వదంతులని నమ్మి వారి ఆరోగ్యాన్నే ప్రమాదంలో పెడుతున్న పరిస్థితులు ఈ నాడు నవ భారతంలో నెలకొన్నాయి . ప్రతి సమస్యకి సమాదానం ఉంటుంది , కరోనా అనే ఈ సమస్యకి నిజమైన పరిష్కారాలు మనవరకు చేరాలి అంటే , ప్రతి భారతీయుడు పరిస్థితిని అర్ధం చేసుకొని తనవంతు బాధ్యతలను నిర్వర్తిస్తూ , అదే సమయంలో మానవతా దృక్పథాన్ని పెంచేటట్లు తన వారు, పక్కవారు, ఊరివారు అందరూ మనుషులే, ఈ సమయంలో అందరికీ ఆరోగ్యం అనేది ప్రాధమిక హక్కు అన్న మాటని గుర్తుచేసుకుంటూ గుర్తుచేస్తూ ఈ పోరాటాన్ని సాగిస్తే భారతం ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి వస్తుంది. ఎడిటర్ ఇన్ చీఫ్ ఆవిర్భవ పక్ష పత్రిక
Go BackYou will receive notification on email .
Click on the button below to confirm your subscription.
Your subscription has been confirmed. Undo
Opps!!! Due to some reason your request can not be fullfilled now. Please try later or contact us helpdesk@readwhere.com
You are already subscribed to this publication using email .
Click on the button below to cancel your subscription.
Your subscription has been cancelled successfully.