Avirbhava Publishing House - Pranathi Maasa Patrika 6th Edition January 29th 2021
దృక్పథం కులమనేది జాడ్యమే అభి జాత్య ముననే యాయు వున్నంతకు. తిరుగుచుండు భ్రమల తెలియ లేక. మురికిభాండమునను ముసరు నీ గలరీతి. విశ్వదాభిరామ వినురవేమ..! కులం...కులమనే కుత్సిత జగతిలో మానవుడు జీవించినంత వరకు సమాజ పురోగతి వుండదు..అయినా, ' కులం ' అనే గోడలు పటిష్ట పునాదులతో నిర్మించు కుంటు వుంటారు చాలా మంది. ఏలి కలు సైతం కులాల కుంపట్లు రాజేసి తమ తమ పబ్బాలు గడుపు కుంటు వుంటారు. ఎక్కువ, తక్కువ కులాలంటు విభజన రేఖలు గీస్తూ ఉంటారు. రిజర్వేషన్ లకు అంకురార్పణ జరిగేది ఇటువంటి సందర్భాలలో నే. తక్కువ కులాలలో ' లేమి ' కలవారు ఉండరు. అగ్ర కులాలలో ' కలిమి ' కలవారు ఉండరు. ఏ కాలమైనా తామూ రిజర్వేషన్ల అర్హత పొందాలని అనుకుంటుంది. ఎందుకంటే, ప్రభుత్వాల ద్వారా అనేక ప్రయోజనాలు పొందాలనే కాంక్షతో.. ' కులాల ' పేరిట రిజర్వేషన్లు ప్రతిభను అణచి వేస్తుంటాయి.. ఈ సంగతి పాలకులకు తెలుసు. ఓటు బ్యాంక్ రాజకీయాల వలన ' కులాలను ' వాడుకుంటూ ఉంటారు వారు. ఇది మన ' ఇండియా ' వంటి దేశాల లోనే కనిపిస్తుంది. అగ్రరాజ్యాల లో మచ్చుకు కూడా ఈ కులాల విభజన ఉండదు. ప్రతిభకు పట్టం కట్టాలని అనుకుంటే ఇటువంటి కులాల విభజన ఉండకూడదు. అయితే ఇందుకు ఏ రాజకీయ పార్టీ సాహసించదు. కులమనే సమస్య తలెత్తకుండా ఉండేది ఒక్క ' వల్లకాటి ' లోనే..అగ్ర కులస్తుడిని తగల పెట్టిన స్థలం లోనే దళితుడి ఖననం జరగ వచ్చు. అప్పుడు ఎక్కడ ఉంటుంది కులభేధం.. ' గాలికి కులమేది.. నీటికి కులమేదీ ' అని ఒక పాటలో పేర్కొన్నాడు ఒక కవి. అలాగే, ' రక్తానికి ' కూడా కులమేది..ఎందరో రక్తదానాలు చేస్తుంటారు..ఎవరి రక్తం ఎవరికి ఎక్కుతుందో..ఆపద గట్టెక్కడమేగా కావలసింది. కులమనే భ్రమలో సమాజం ఈత కొట్టినంత వరకు.. ఒడ్డనేది తెలియనంత అభిజాత్యంలో మునిగినంత వరకు మానవుడు ' కూపస్త మందుకమే. - పంతంగి శ్రీనివాసరావు ఎడిటర్ - ఇన్ - చీఫ్
Go BackYou will receive notification on email .
Click on the button below to confirm your subscription.
Your subscription has been confirmed. Undo
Opps!!! Due to some reason your request can not be fullfilled now. Please try later or contact us helpdesk@readwhere.com
You are already subscribed to this publication using email .
Click on the button below to cancel your subscription.
Your subscription has been cancelled successfully.