విషయ సూచిక వేదం బ్రహ్మ సూత్రాలు 3 అనాది నిధనం 5 వైదికధర్మ సిద్దాంతాలు 7 ఉపబృంహణాలు – వ్యాఖ్యానాలు 10 జీవం దిక్సూచి 15 హరి నామమే సర్వం 18 జగద్గురు శంకరాచార్య 20 వివేచన భాగవతము మహిమ 23 సుందరకాండ వైభవం 28 దిగంబర వర్థమానుడు 31 తత్వం కానుకలివ్వడం 32
దృక్పథం
జిహ్వ ను అదుపులో
పెట్టుకోవాలి
అదిమి మనసు నిలిపి ఆనంద కేలిలో
బ్రహ్మమయుడు ముక్తి బడయ గోరు.
జిహ్వ రుచులచేత జీవుండు చెడునయ
విశ్వదాభి రామ వినురవేమ.
సర్వం అనుభవించాక, వైరాగ్యంతో జనులకు నీతులు చెప్పిన వ్యక్తి 'వేమన' అని కొందరు వితర్క వాదులు వాదించ వచ్చు గాక.. అతి జిహ్వచాపల్యం వలన జీవులకు కొన్ని తిప్పలు తప్పవు. తన మనస్సును స్థిరంగా నిలిపి ముక్తికోసం ప్రయత్నించే వాడు జ్ఞాని. మనస్సు పాదరసం వంటిది కనుక దానిని అదుపులో పెట్టుకుంటే ఇది సాధ్యం కావచ్చును ఏమో కానీ, జిహ్వను అదుపులో పెట్టుకోవడం కనాకష్టం. అది రకరకాల రుచుల కోసం అన్వేషిస్తుంది.. రుచి మరిగిన జిహ్వ ను అదుపు చేయటం కనాకస్టం.
బయట హోరున జోరుగా వర్షం..ఆ సమయంలో వేడి వేడి బజ్జీలో, పకొడీనో నూనెలో ' సుయి.. సూయి 'మంటోంటే... వాహ్.. జిహ్వను అదుపులో పెట్టుకో గలమా... అలాగే, వారాంతంలో మాంసాహారం.. అదివుంటే కొద్దిగా ఆల్కాహాలు.. ఈ అలవాటు నుంచి విముక్తి కావడం ఎంత కష్టం... అయితే, ఇవి ఆరోగ్య దాయకమా అంటే..అదే పనిగా తీసుకుంటే ఏదయినా అనర్ధ దాయకమే.. ఈ అలవాట్లు మానాలంటే మనస్సును ఎంతో అదుపులో వుంచుకోవాలి.. అప్పటికీ కార్తీక మాసమని..ఆ వారం..ఈ వారమనీ..వివిధ రకాల దేవుళ్ళ పేర్లు మీద మదిని అదుపులో ఉంచుకునే వాళ్ళు కోకొల్లలు ఈ పృధ్వీలో... ఏదయినా మితంగానే ఉండాలి.. అమితం కాకూడదు..జీవితం క్షణికమేగా అనే మూర్ఖపు వాదన కూడా తగదు..ఏ రుచులూ లేనంత మాత్రాన మృత్యువు నుంచి తప్పించుకో లేడు.
అయినా, కొన్ని రుగ్మతల నివారణ కోసం మనస్సును జయించాలి. అలవాట్ల లో ఇది మంచి, ఇది చెడు అనేది జిహ్వకు తెలియదు..మనమే మనస్సును నిభాలించు కోవాలి. ఆరోగ్యమే మహభాగ్యము అనే సూక్తిని పాటించాలి.. పంతంగి శ్రీనివాస రావు ఎడిటర్ - ఇన్ – చీఫ్