విషయ సూచిక వేదం ఉపనిషత్తుల స్పూర్తి 3 వేదం – ధర్మం 7 సృష్టి -వేద శబ్దం 9 బ్రహ్మభూతస్థితి 11 జీవం దిక్సూచి 13 ధ్యానయోగ సమాహారం 15 అమ్మ.. అమృతవల్లి 18 వివేచన మహా పురుషులు 20 అక్షయ రామాయణం 21 సమాజం – సాహిత్యం 24 తత్వం మతం మత్తుమందా! 26 సత్యమేవ జయతే 27
జయహో భారతీయత
ఏ దేశమేగినాఎందుకాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
భారతీయత విశ్వమంతా వ్యాపించిన ఐక్యమత్యానికి ప్రతీక. మన భారతీయులు ప్రపంచమంతా, వివిధ దేశాలలో విభిన్నవృత్తులతో స్థిరపడి వున్నారు.
వారి వారి ప్రతిభ ఆధారంగానే, ఆయాదేశాల్లో నివసిస్తున్నా కూడా మనభారతీయతను విస్మరించకపోవడం అభిలషణీయం.
ఏ పండుగ అయినా, మరే కార్యక్రమం అయినా మన భారతీయ ఆత్మను ప్రతిబింబించే విధంగా ఆయా ఉత్సవాలకు రూపకల్పన చేస్తుంటారు. వేషభాషలు మారవు...సంప్రదాయాలు మారవు... ఎక్కడున్నా, ఇక్కడఉన్నట్టే....
శివరాత్రికి ఎన్నిమైళ్ళ దూరంలో వున్నా శివాలయాలు శివనామస్మరణతో కోలాహలం సంతరించుకుంటాయి. అలాగే విజయదశమి, ఉగాది ఉత్సవాలు...
ఇక గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలు చాలావరకు భారతీయుల సమూహంతో కూడి ఉంటాయి. అక్కడ ఆట,పాటా,మాటా,మంతీ, సాహితీసమావేశాలు... ఇత్యాదివి ఫక్తు మన భారతీయతను చాటిచెప్పే విధంగా నిర్వహించబడతాయి.
అగ్రరాజ్యం అమెరికాలో ఐతే 'తానా' మహాసభలు కూడా జరుపుకుంటుంది. అక్కడ జరిగే ఆ సభలకు భారతదేశం నుంచి పదులసంఖ్యలో ప్రతినిధులు అక్కడ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు... ఈ ప్రదర్శనలకు విశేష ప్రాచుర్యం వుంది..
అక్కడ జన్మించే పిల్లలకు అక్కడ 'సిటిజెన్ షిప్' ఉన్నాకూడా, వారికి సైతం ఇక్కడి 'కల్చర్' నేర్పిస్తుంటారు తల్లిదండ్రులు. అక్కడ వున్నా, మనస్సు ఇక్కడిదిగా మెదిలే, మసలే ప్రవాస భారతీయులు, మన సంప్రదాయం మరిచిపోకుండా, ఎల్లలుదాటి విశ్వవ్యాప్తం చేస్తున్న భారతీయులు....
వీరు తమ వ్యక్తిగత అభివృద్ధికోసమో, తమ ప్రతిభా పాటవాలకు గుర్తింపుకోసమో, వివిధ దేశాలలో కుటుంబసమేతంగా స్థిరపడి, వృద్దిచెందినా మనజాతి ఔన్నత్వాన్ని కాపాడుతున్నందుకు.....వందనం... అభివందనం....
పంతంగి శ్రీనివాసరావు
-ఎడిటర్ ఇన్ చీఫ్