Pranati 5th Edition December 27th 2020
Pranati 5th Edition December 27th 2020

Pranati 5th Edition December 27th 2020

  • Pranati 5th Edition December 27th 2020
  • Price : Free
  • Avirbahva Publishers
  • Language - Telugu
  • Published monthly
This is an e-magazine. Download App & Read offline on any device.

విషయ సూచిక వేదం మంత్ర బ్రహ్మం 4 సంసార చక్రం 9 ఋషుల ప్రమాణం 11 కర్తవ్య ఉద్భోదన 13 జీవం దిక్సూచి 17 జైన క్షేత్రాలు, బసదులు 20 ‘శుశ్రుతుడు’ 27 వివేచన నాన్న.. సర్వం తానై! 29 సుందరకాండ వైభవం 31 మాస ప్రత్యేకం 34 తత్వం ఎదురీత 41

దృక్పథం

జూదము అతి పెద్ధ వ్యసనము                                                                                             

అనువుగాని చోట పనిగొని జూదము.                    

నాడియాడి యోడి యడవిసొచ్చు                    

 ఘనుని జాడ జూచి గడువుము మూర్ఖత.           

విశ్వదాభి రామ వినుర వేమ......                                   

 జూదము... ఇది సంసారాలను  చిన్నాభిన్నం చేసే అతి పెద్ద చెడు వ్యసనం. ఈ ఈ వ్యసనాలకు అలవాటు పడిన వారు బాగుపడిన దాఖలాలు లేవు. కొందరికి చతుర్ముఖ పారాయణం ( పేకాట ), మరికొందరికి గుర్రప్పందాలు... ఇంకా కొందరికి కోడి పందాలు..ఇలా రకరకాల వ్యసనాలు..పల్నాటి యుద్ధం కు కారణం చరిత్ర ఎరిగిన వారందరికీ తెలిసిందే...మహాభారత సంగ్రామంలో ఈ జూదం పాత్ర అందరికీ తెలిసిందే....                                             

 జూదం అతి పెద్ద జాడ్యం...స్థిరాస్తులు కు కాళ్ళు వచ్చేది ఇటువంటి వ్యసనాలకు దాసులై, వాటిలో పరాజితులు కావడం వల్లనే.. చివరకు నైతికంగా ఎలా దిగజారతారు అ0టే.. కట్టుకున్న ఆలిని,కన్న సంతతిని సైతం ' పణం ' పెట్టేటంతగా.. ఇది పురాణాల ద్వారా సర్వ జనులు ఎరిగినదే.. జూదం ఎంత వికృత క్రీడ అంటే.. దీనికి దాసానుదాసులు అయిన వారు .. ఈ ఈ వ్యసనాలు నుంచి బయట పడ లేనంతగా...                     

జూదం ఆడి పాండవులు అష్ట కష్టాలు పడగా..ఆ ఆటకు ఆహ్వానించిన కౌరవులు సర్వ నాశనం అయ్యారు.. అన్ని అనర్థాలకు హేతువు జూదము. అమెరికాలో కాసినోలు చట్టబద్ధం కావొచ్చు గాక..అభివృద్ధి చెందుతున్న దేశాల జనుల జీవన ప్రమాణాలకు ఇది సరిపడని వ్యసనం.                                                                         తెలుగునాట సంక్రాంతికి ' కోడి పందెంలు ' ఒక ఆచార క్రీడ..ఈ పందాలలో యకరాలకు యకరాలు పందాలు ఒడ్డు తుంటారు..కోటాను కోట్ల డబ్బు చేతులు మారుతుంటుంది..ఆంధ్ర నాట ఇదొక విశ్వాసంగా మారింది. దీనిని ప్రజల నుంచి విడదీయరాని ఆచారంగా, ఆయా నాట బహుళ ప్రాచుర్యం పొందినది గా పేర్కొన వచ్చు. అలాగే, పేకాట క్లబ్బులు కు అనుమతి లేకపోయినా అనదీకృతం గా ఈ వ్యసనం ద్వారా తమ తృష్ణ తీర్చుకునే వారూ లేకపోలేదు.                       

  ఈ జాడ్యానికి మందు సర్వనాశనం ద్వారా కట్టుబట్టలతో మిగలడమే.. ఇదొక వదలని జాడ్యం.. దీనిని వదిలించు కున్నవాడు సుఖ పడతాడు... సంసారానికి ఊతంగా మిగులుతాడు..                                                                  

- పంతంగి శ్రీనివాసరావు

    ఎడిటర్ - ఇన్ - చీఫ్