వేదం మూడు విషయాల్లో మూలం 3 ఆత్మసుఖం 6 వేదం -ఆనందం 10 పరమాత్మ తత్త్వం 13 జీవం దిక్సూచి 15 విపశ్యనా ధ్యానం 17 వివేకవంతుడు– వివేకానందుడు 22 వివేచన రామావతార విశిష్టత 24 వాస్తవ అన్వేషణ 28 సమాజం – సాహిత్యం 30 తత్వం పూర్వకర్మల ఫలితమే కారణం 32
దృక్పథం
ప్రతిభకు కులం ఆలంబనా?
అజ్ఞానమే శూ ద్రత్వము
సుజ్ఞానము బ్రహ్మమౌ ట శృతులను వినరా
అఙ్ఞానమడచి వాల్మీకి
సుజ్ఞానపు బ్రహ్మమొందే చూడర వేమా!
' కులం ' ప్రతిభకు కొలబద్ద కాదు. కులం అనేది మన భారతీయులలో వ్రేళ్ళూనుకున్న జాడ్యం..కులాల రిజర్వేషన్లు కుంపట్లు రగిలిస్తున్నాయి. ఇది అభివృద్ధి నిరోధకము. ఇక్కడ తక్కువ, ఎక్కువ అనే భేదాలు ఉండవు.
అజ్ఞాని, జ్ఞాని..రెండే రెండు కులాలు. జ్ఞానం అనేది పరబ్రహ్మ స్వరూపం. అజ్ఞాని తక్కువ కులస్తుడు. అనాది నుంచి వెనకబడ్డ కులాలు, దళితులు, అగ్రజాతి అనే విభజన జరగటం వలన ప్రతిభకు సమాధి కట్టబడుతోంది. ఇది దౌర్భాగ్యం. భారతీయ పరిభాషలోనే దళితుడైన అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. గిరిజనుడు అయిన (బోయ) వాల్మీకి అజ్ఞానాన్ని పోగొట్టుకుని బ్రహ్మ స్వరూపాన్ని పొందాడు. మరి వీరిని కులంతో తూచే సాహసం చేయగలమా..
కుల వివక్ష, వర్ణ వివక్ష..వీటిని పాటించడం అనాగరిక చర్య..ఇవి భారతీయ ఆత్మను ప్రతి బింబించవు. కేవలం రాజ్యాధికారం కోసం ఏలికలు ప్రయోగించే తంత్రాలు ఇవి. దురదృష్టం ఏమిటంటే,కేవలం రిజర్వేషన్ల కోసం అగ్ర కులస్తులమని చెప్పుకునేవారు కూడా తమను ' వెనకబడిన ' వారి జాబితాలో ప్రకటించమ ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని రిజర్వేషన్లు ఉంటే అంత గొప్ప అనే పరిస్థితి దాపురించింది. కులం అనే కార్డును జీవన విధానం నుంచి తొలగించే సాహసం ఎవరూ చేయరు. ప్రతిభ ఉన్నవాడే, సమాజానికి వెలుగు చూపించిన వాడే ' మనోడు ' అనుకునే పరిస్థితి రావాలి. అది వస్తుందా...ఏమో...
పంతంగీ శ్రీనివాస రావు
ఎడిటర్ - ఇన్ – ఛీఫ్