Pranathi Seventh Edition March 4th 2021
Pranathi Seventh Edition March 4th 2021

Pranathi Seventh Edition March 4th 2021

  • Pranathi Seventh Edition March 4th 2021
  • Price : Free
  • Avirbahva Publishers
  • Language - Telugu
  • Published monthly
This is an e-magazine. Download App & Read offline on any device.

విషయ సూచిక 

వేదం

వేదాలు - మానవ జీవనం             4

ఆత్మసాక్షాత్కారం      7

అమృత మథనం               9

సమాశ్రయణం                      13

జీవం

దిక్సూచి   16

ఋషీ సంస్కృతి            18

మదర్ థెరీసా            19

వివేచన 

అల్లుడు... జామాత   21

సుందరకాండ వైభవం              23

రామాయణం లోని ధార్మికత       26                  

 తత్వం

చెట్లు నశిస్తే  మనిషీ నశిస్తాడు    30

 

దృక్పథం                                                                        

భార్య మాట వినాలి...

కానీ !

ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి.                 

వేరుపరుచునుండు వెర్రిజనుడు.                       

 కుక్కతోక పట్టి గోదావరీదును.                            

 విశ్వదాభిరామ వినురవేమ.                                     

  ఇల్లాలి మాటలు వినాలి.. భార్య సలహాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇది సంసార ఉన్నతికి తోడ్పడే సూక్తి. అలాగే, భార్య ఏదయినా చెడు సూచన చేస్తే నిర్ద్వందంగా  ఖండించక పోయినా, నెమ్మదిగా హితవు చెప్పాలి. లేకపోతే, ఆలికి ' ఇగో ' వస్తె సంసారంలో కలతలు వస్తాయి.. ఏ ఉదాహరణ అయినా చూడండి.. లోకంలో అక్కాచెల్లెళ్ళు కలిసి ఉన్నట్టు .. అన్నదమ్ములు ఏ పొరపొచ్చాలు లేకుండా ఐకమత్యంగా ఉండటం చాలా చాలా అరుదు.. ఇందుకు ఆడవారే కారణంగా చాలామంది భావిస్తుంటారు..                       

  ఇల్లాలి ఓపికే సంసారానికి కొండంత బలం. ఆ ఓపికే క్షీణిస్తే బంధుత్వాలులో కుంపటి 

రగులు తుంది. అన్నదమ్ముల మధ్య బద్ధ వైరం మొదలవుతుంది. ఒకే రక్తం పంచుకుని కలకాలం కలిసి ఉండవలసిన సోదరులు విడిపోవడానికి ' ఆడదే ' కారణమని భావించినా, అందుకు కారణాలను అన్వేషించాలి.                                          

పచ్చగా ఉన్న సాన్నిహిత్యాలు మసక బారటం కుటుంబంలో అశాంతికి దారి తీస్తుంది.. వేమన ఏది చెప్పినా జనులు తల ఊపుతారు అనే ఉద్దేశ్యంతో భార్య మాటను ఈ సామెతలో కుక్కతోక తో పోల్చడం అంత సవ్యంగా అనిపించదు. జీవితాంతం తోడునీడగా మెలిగే ఇల్లాలిని అలా కాకుండా వేరే విధంగా ఉటంకిస్తే బావుండేది.                                                                

   ఇది ఇలా ఉండగా, తోడికోడళ్ళు మధ్య పొసగక పోవడం వలన అన్నదమ్ముల మధ్య వైరం కలుగుతుంది. దీని బదులు ఎవరి జీవితాలు వారివిగా భావించి, విడివిడి సంసారాలు గడపటం శ్రేయస్కరం. అప్పుడు, అనుబంధాలు పటిష్ఠంగా ఉంటాయి. ఏదయినా, ఏదో ఒక సందర్భంలో కలుసు కోడంలో ఉన్న ఆనందం..ఈ రోజుల్లో కలిసి ఉండడంలో ఉండడం లేదు.                                            ఏ ఇల్లాలు అయినా .. ఇది నా సంసారం అని గిరి గీసుకుని ఆ పరిధిలోనే జీవిస్తుంది..దీనిని, ఆమె స్వార్థంగా భావించ కూడదు. పెద్ధలయినా, తమ తమఆస్తిపాస్తులు ను తమ సంతతికి సకాలంలో హెచ్చు తగ్గులు లేకుండా పంచితే భావిలో సోదరుల మధ్య ఏ విధమయిన భేదాభి ప్రాయాలు రావు..తన సంసార భద్రతే, ఆనందమే ఏ ఇల్లాలయినా కోరుకుంటుంది..ఇది గమనించాలి..                                                               

 - పంతంగి శ్రీనివాస రావు 

   ఎడిటర్ - ఇన్ – చీఫ్

*   *   *