విషయసూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒకరు 5 ఫ్యాబ్ లివింగ్ 8 ఆరోగ్య వాణి 13 మహిళ శక్తి 17 నేటి సౌదామిని 15 మేలుకొలుపు 24 సాహిత్యం సాహితీ మార్గదర్శకులు 29 కథా సమయం 32 నేటి కవిత్వం 41 పుస్తక దర్పణం 43 కవితామృతం 47 నవలాముత్యం 50 సంస్కృతి 57 యువత స్నేహస్వరం 65 కార్యభారతం 69 కళా వైభవం 72 జిజ్ఞాస 75 రాజ్యం సందర్భం 78 జీవన చిత్రాలు 82 ప్రాంతీయం 72 సినిమా గత సినీ వైభవాలు 75 సీరియల్ 77 మా తత్వం
సమాలోచన
మేలి ముసుగు
సాహిత్యం, సంస్కరణలు, ఇలా ఎన్నో “స్త్రీ అనే అంశం మీద ఎప్పుడు సరికొత్త వాదాన్ని వెలుగులోకి తెస్తూనే ఉన్నాయి. అవును! నిజమే! ఈ రోజు స్త్రీకి కావాల్సినంత స్వేచ్చ ఉంది. తన లక్ష్యాలు సాధించడానికి అడ్డుగోడలు లేవు. అంటే ‘స్త్రీ మీద రుద్దబడిన ఆంక్షలన్ని నేడు చాలావరకు కనుమరుగయ్యాయి. అలా అని ‘స్త్రీ సుఖంగా ఉందా? సుఖం- అంటే అర్ధం ఏ చింతా లేకుండా ఉ౦డగలుగుతుందా? ‘రోజులు అసలే బాగాలేవు. కాస్త పెందలాడే ఇంటికి రావడానికి ప్రయత్నించు..’, ‘నీకు ఏమాత్రం ఆలస్యం అయ్యేలా ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పు.’ ఇలా అనుకోకుండా ఈ డైలాగులు లేకుండా మన నిత్యజీవితం గడుస్తుందా?
స్త్రీలు ధైర్యంగా తమ ప్రగతిని తామే నిర్దేశించుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నారు. దానిలో సందేహమే లేదు. కానీ మధ్యలో అత్యాచారాల, హత్యల ఉనికి ఎప్పుడూ చరమగీతానికి చేరువ అవుతుంది? ఇవి ఓ పక్కన జరిగిపోతూ ఉండి, ఇంకో పక్క అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే అప్పుడు దీన్ని ఏ కోణంలో సమతుల్యతగా చూడాలి? ఇంకోవైపు తిరోగతికి స్వాగతం పలకడం జరిగింది. అందుకే ‘స్త్రీ సమానత్వం విజయం సాధించిందా? లేదా? అన్న ప్రశ్నకు ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానమే ఉండటం లేదు.
‘స్త్రీ సమానత్వం, స్వేచ్చ అనే అంశాల్ని పటిష్టం చేసుకుంటున్న వైనంలో ఇంకోపక్క కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కూడా జరుగుతూ వచ్చింది. అంటే ఒకవైపు పురోగతికి పాదులు చేస్తూ..
విత్తు వేసిన తర్వాత దాని ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. పురోగతి ఫలాలైనా, తిరోగతి తీరాలైనా! పురోగతి సమతుల్యత వైపు మళ్లాలంటే పరిణామక్రమంలో విషఫలాలుగా చొచ్చుకు వచ్చిన తిరోగతి మూలాల్ని గుర్తించి, వాటిని సమూలంగా సమాధి చేస్తూ పురోగతి వైపు మళ్లాలి. అప్పుడే నిజమైన స్వేచ్చ భద్రతలో కట్టుబడకుండా సహజంగా ఉంటుంది. ఇది ఉద్యమాలతో వచ్చే మార్పు కాదు... మనుషులతో మమేకం అయిపోవడం వల్ల వచ్చే మార్పు. ఇది స్త్రీలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. విశ్వజననీయమైన అంశం. అంశం స్త్రీ అయినా అది సర్వజనుల అంశమే లోతుగా చూస్తే! స్త్రీ సమానత్వ పరిష్కారం తోనే మానవసంబంధాల ధృడత కూడా ఇమిడి ఉంది.
సమాధానంలేని ప్రశ్నల్ని, స్పష్టమైన కార్యాచరణలేని వాదాల్ని 'పిడిగుద్దు 'గా పౌరుల మీద గుప్పించినంతకాలం సమాధానం లేని ప్రశ్నలాగే స్త్రీవాదం మిగిలిపోతుంది. వరస్పరం స్తీ వురుషులు ఒకరిమీద ఒకరు ఆధారపడడం సృష్టిసూత్రం. ఆ సూత్రం వేర్వేరు రూపాలు తీసుకోవచ్చు. కానీ సూత్రం మాత్రం మారదు. 'ఆధారపడటం' అనేది వ్యక్తిని తక్కువ చేసి, ఇంకొక వ్యక్తిని అధికంగా చూపే అంశం కాదు. జీవితాన్ని సులువుగా, ఆహ్లాదంగా గడపటానికి, మారాలి అన్న అవకాశం మాత్రమే. ఈ విషయం మీద పరిపూర్ణ స్పష్టత, అవగాహన లేనంతవరకు అసలైన వాదం ఎప్పుడూ వక్రీకరించబడుతూనే ఉంటుంది. అసలైన విషయం వక్రీకరణ కోణంలో సాగినంత కాలం అభివృద్ది గమనం తిరోగతిగా పరిణమిస్తుంది.