విషయ సూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒక్కరు 3 ఫ్యాబ్ లివింగ్ 8 ఆరోగ్య వాణి 10 మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్పెషల్ మహిళా భేరి 13 సాహిత్యం సాహితి మార్గదర్శకులు 33 కథ సమయం 37 నేటి కవిత్వం 47 పుస్తక దర్పణం 50 కవితామృతం 56 నవలాముత్యం 58 సంస్కృతి 63 యువత స్నేహ స్వరం 67 కార్య భారతం 70 జిజ్ఞాస 72 రాజకీయం సందర్భం 75 జాతీయం 77 తెలంగాణం 79 ఆంధ్ర దర్పణం 80 ఫన్ కార్నర్ నవ్వుల కుంచె 81 సినీ దర్పణం గత సినీ వైభవాలు 82 సినీ హోరు 84 ఇదండీ సంగతి 87 సీరియల్ 88 మా తత్వం 95
సమాలోచన
పాండవులు అడిగింది ఐదు ఊర్లు, రాముడు అడగనిది అయోధ్యా ,మాలో ఒకరు కోరింది సిద్ధాంతాన్ని మార్చమని. అది కుదరదని తేల్చి తల దించక నిలిచినందుకు పర్యవసానం ఆవిర్భవ వెనుక ఉండి నడిపిస్తున్న మా మీద దుష్ప్రాచార౦ .అయినా అన్నిటిని తట్టుకునే శక్తి మాకుంది అన్న ధైర్యానికి నిరూపణే మా ఈ పన్నెండవ సంచిక. ఇది మా నిజాయితీకి నిదర్శనంగా నిలవాలని తలుస్తూ అది కూడా సరైన సందర్భాన్ని పురస్కరించుకొని మేము నమ్మిన సిద్ధాంతాలైనా సాహిత్య , మహిళా పత్రికగా మీ మనసుల్లో నిలిచిపోవాలి అన్న ఆకాంక్షతో మేము ఈ సంచికలోని శీర్షికలు జతపరచటం జరిగింది.
మనలో ఒకరే కానీ వృత్తి పరంగా రిటైర్ అయినా ప్రవృత్తి పరంగా రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతూ ఉన్న సోషియో జర్నలిస్ట్ శ్రీ భండారు శ్రీనివాసరావు గారి గురించి ప్రత్యేక కథనం మనలో ఒకరు లో, ట్రెండ్ సృష్టిస్తున్న లిబ్రా కరెన్సీ గురించి ఫ్యాబ్ లివింగ్ లో ఇంకా ఎన్నో లైఫ్ స్టైల్స్ లో మీ కోసం.
ఏ సమాజానికైనా మొదలు ఓ మహిళా. కాలంతో పాటు స్త్రీ స్థితిగతులు మారుతున్నాయి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాహిత్యంలో శక్తివంతులైన స్త్రీల అంతరంగాలను ఈ సంచికలో మహిళా విభాగంలో మీ కోసం.
సాహిత్యంలో మార్గదర్శకులలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన డాక్టర్ మాలతీ చందూర్ గారి గురించిన ప్రత్యేక కథనం, నాటి నవలాముత్యం అయినా దాశరధి రంగాచార్యగారి చిల్లర దేవుళ్ళు రెండో భాగం, దేవరకొండ బాల గంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి లోని రెండో కవిత, సమకాలీన సాహితీవేత్తల కథలు,కవితలతో పాటు హిందూ ధర్మ గొప్పతనాన్ని చాటే కాళంరాజు వేణుగోపాల్ గారి సంస్కృతి, ఓ మంచి పుస్తకాన్ని మీ అందరికీ పరిచయం చేసే క్రమంలో పుస్తక దర్పణం మీ కోసం సాహిత్యం విభాగంలో.
ఓ సామాన్యుడి ఘోష రాజ్యం లో మీ కోసం ప్రత్యేకం. ఇంకా ఎన్నో అలరించే అంశాలతో ఈ 12 వ సంచిక ప్రత్యేకంగా మీ కోసం.