విషయసూచిక మా వసంత పండుగ స్పందనల ప్రతిబింబం 2 మా పయనం 23 మనస్సుమాంజలి 29 సాహిత్యం సాహితీ మార్గదర్శకులు 35 కథా సమయం 44 నేటి కవిత్వం 52 పుస్తక దర్పణం 54 కవితామృతం 60 నవలాముత్యం 63 సంస్కృతి 70 యువత స్నేహస్వరం 77 కార్యభారతం 80 జిజ్ఞాస 82 రాజ్యం సందర్భం 84 జీవన చిత్రాలు 88 ప్రాంతీయం 94 సినిమా గత సినీ వైభవాలు 97 సీరియల్ 77 మా తత్వం
సమాలోచన
“ఈ పత్రిక మనిద్దరం తప్పితే ఎవరు చదవరు” అన్న రచనా మాట ఈ రోజుకి నాకు బాగా గుర్తుంది, కానీ 23వ సంచిక దాదాపు 25 లక్షల మండి ఆన్లైన్లో చదివిన మా పాఠకులును చూసిన తరువాత,ఓ చిన్న ఆలోచన ఈ నాడు ప్రజా గళంగా మరీనందుకు మేము గర్వపడుతున్నాము అన్న మాట చెపితే చాలా చిన్నగా ఉంటుంది .
బజారులో చాలా పత్రికలు దొరుకుతాయి,వాటిలో సగం పేజీలలో నిండి ఉండేవి వ్యాపార ప్రకటనలతో. కానీ ఆవిర్భవ మూల నీతి ఏ రకమైన వ్యాపార నీతికి తలవగ్గ కూడదన్న నిర్ణయానికి నిలిచి , ప్రతి సంచిక కూడా జనాదరణను పొంది పెరిగి మాకు గర్వంగా నిలిచింది. ప్రతీక అంటే ప్రజా నాడిని తెలిపే ఓ సాధనం ,కానీ అదే పత్రికను అడ్డం పెట్టుకుని ఓ మాయాజాలంగా మార్చి జనాలోచనని వారి వారి రాజకీయ పురోగతిని పెంచే ప్రయత్నంలో పత్రికల్ని ఓ ఆయుధంగా మార్చుకున్న పత్రికలు నేడు ఎన్నో ఉన్నాయి.
పత్రిక అనేది ఓ వ్యాపారంగా నిలిచేదానికన్న సమాజ మార్గదర్శిగా నిలుస్తూ వారు ప్రచురించే అక్షరాలని పునాదులుగా వేసి నవ సమాజ నిర్మాణానికి ఓ పునాది కావాలి కానీ,మనం ఉన్న ఈ పరిస్థితులలో చాలావరకు ఉన్న పత్రికలు వాటి మనుగడ కాపాడుకోవటానికి సమాజంలో ఉన్న పాత నరశక్తులకే దాసోహం అంటూ వారు ఇచ్చే కరెన్సీ కట్టాలకు తగ్గట్టుగా అక్షర సేద్యం చేస్తున్నాయి. కానీ నిజానికి నిలవాల్సినప్పుడు వారి సమాజపు బాద్యతా ధోరణి నకిలీయయీ నిలుస్తుంది. వారికి భిన్నంగా ఆవిర్భవ కరోన మహమ్మారి భాగ్యనగరంలో ఆకలికి బలై నిలిచిన వేలమందికి మేమున్నమూ మీతో అన్న దైర్యంగా నిలిచినందుకు గర్వపడుతున్నాము .
కళనే నమ్ముకొన్ని వ్యక్తిత్వాన్ని కడుపు నింపుకునే కోసం పక్కకు పెట్టి రోజువారీ వృత్తిగా మార్చుకున్న సినీ జూనియర్ ఆర్టిస్టులకి వస్తున్న సహాయాన్నికూడా పంది కొక్కులవలే తినేస్తున్న బడా బాబుల జీవితాలని బయట పెట్టి వారి ఉక్రోషానికి ఎదురు నిలిచినందుకు ఆవిర్భవ నిజాయితికి ఇచ్చిన సర్టిఫికేట్ ముచ్చటగా మూడు క్రిమినల్ కేసులు పెట్టినందుకు మేము సమాజ దర్పణంగా నిలిచామన్న దానికి నిదర్శనం.
ఈ రోజుల్లో పత్రికను నడపటం అనేది అనవసరం అన్న ఎత్తి పొడుపులన్నీ ఎదురుకుంటుంది మేము ఏదో గొప్పవాళ్ళం అని కాదు . మమ్మలల్ని నమ్మి మా వెన్నంటి నిలిచిన మా సాహితి కుటుంబానికి మేము జీవిత కాలం ఋణ పడుతూ..
మీ ఆవిర్భవ