విషయసూచిక
లైఫ్ స్టైల్స్
ప్రతిబింబం 5
మనలో ఒకరు 8
ఆరోగ్య వాణి 13
మహిళ
ఉనికి 16
నేటి సౌదామిని 19
మేలుకొలుపు 24
సాహిత్యం
సాహితీ మార్గదర్శకులు 28
కలంతో కాసేపు 36
కథా సమయం 39
నేటి కవిత్వం 44
పుస్తక దర్పణం 46
కవితామృతం 49
నవలాముత్యం 51
సంస్కృతి 55
యువత
ఆలోచిద్దాం! అడుగులు వేద్దా౦! 61
కార్య దీక్షితులు 64
జిజ్ఞాస 67
రాజ్యం
సందర్భం 69
మరోవైపు 71
ప్రాంతీయం 74
సినిమా
గత సినీ వైభవాలు 76
సెల్యులోయిడ్ దర్పణం 78
మా తత్వం
సమాలోచన
జనజాగృతి లోపించిన
భారత కరోనా పోరాటం
నేటి భారతం అత్యంత క్లిష్టమైన పరిస్థితులతో పోరాడుతూ ఉంది . యావత్ ప్రపంచపు లోగిళ్ళకు కొద్ది కాలం కింద వ్యాక్సిన్ అందించిన భారత్ ఈ నాడు అదే వ్యాక్సిన్, ఆక్సిజన్ కొరతతో సతమతమౌతుంది. ఇది నాణ్యనికి ఓ వైపు కధ అయితే మరో వైపు భయంకర నిజం ఒకటి దాగి ఉంది, అది మనల్ని ఆలోచింప చేయాల్సింది.
ఏ పోరుకైనా అవగాహనతో బాధ్యతగా చేయగలిగితే విజయం మనదే అవుతుంది, ఇది నూరు శాతం నిజం, కానీ ఈ పరిస్థితులలో మనం కరోనా పోరులో చాలావరకు బాధ్యతారహితంగానే పనులు చేస్తున్నాము అన్నది నిలువెత్తు నిజం. ఉదాహరణకి జరుగుతున్న వ్యాక్సినేషన్ గురించి ఎన్నో అపవాదులు ప్రచారంలో ఉన్నాయి, వ్యాక్సిన్ వేయించుకుంటే మన ఆరోగ్యానికి ప్రమాదం అని, అది కాక కోవిడ్ నియంత్రణకు పెట్టే ఏ ఒక్క చర్యని పాటించకపోవటం, ఇలాంటివెన్నో ఈ నాడు కరోణా విచ్చలవిడిగా విజృంభణకు కారణాలుగా నిలిచాయి .
ఈ నాడు కరోనా గురించి ప్రచారంలో ఉన్న విషయాల్లో చాలా వరకు వదంతులు అనే చెప్పవచ్చు. వాటిని ప్రచారంలో ఉండనిచ్చి మనం లేని సమస్యలని పెంచుకుంటున్నాము . కొన్ని ప్రాంతాలలో కరోనా వచ్చిన కుటుంబాలను వెలివేసిన వార్తలు కూడా మనకు వినికిడిలో ఉన్నా మనం పట్టనట్లు ప్రవర్తిస్తున్నాము. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి అధికారులు పెట్టిన ఎన్నో కట్టడులు మనం విని విననట్లు వదిలేయటం వలన వ్యాప్తి ఆగక ఇంకా ప్రచండరూపం దాల్చిన నిజాన్ని మనం మరచి, ఇది మన సమస్య కాదు సర్కారుది అన్నట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటే అది బాధ్యతలేని ప్రవర్తనే అన్నది నిజం .
పెద్ద చదువులు చదివిన మహనీయులు కూడా వదంతులని నమ్మి వారి ఆరోగ్యాన్నే ప్రమాదంలో పెడుతున్న పరిస్థితులు ఈ నాడు నవ భారతంలో నెలకొన్నాయి .
ప్రతి సమస్యకి సమాదానం ఉంటుంది , కరోనా అనే ఈ సమస్యకి నిజమైన పరిష్కారాలు మనవరకు చేరాలి అంటే , ప్రతి భారతీయుడు పరిస్థితిని అర్ధం చేసుకొని తనవంతు బాధ్యతలను నిర్వర్తిస్తూ , అదే సమయంలో మానవతా దృక్పథాన్ని పెంచేటట్లు తన వారు, పక్కవారు, ఊరివారు అందరూ మనుషులే, ఈ సమయంలో అందరికీ ఆరోగ్యం అనేది ప్రాధమిక హక్కు అన్న మాటని గుర్తుచేసుకుంటూ గుర్తుచేస్తూ ఈ పోరాటాన్ని సాగిస్తే భారతం ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి వస్తుంది.
ఎడిటర్ ఇన్ చీఫ్
ఆవిర్భవ పక్ష పత్రిక