Avirbhava Paksha Patrika 30th Edition April 13th 2021
Avirbhava Paksha Patrika 30th Edition April 13th 2021

Avirbhava Paksha Patrika 30th Edition April 13th 2021

  • Avirbhava Paksha Patrika 30th Edition April 13th 2021
  • Price : Free
  • Avirbahva Publishers
  • Language - Telugu
  • Published bimonthly
This is an e-magazine. Download App & Read offline on any device.

విషయసూచిక

లైఫ్ స్టైల్స్

ప్రతిబింబం                                5

మనలో ఒకరు                            7

ఆరోగ్య వాణి                               11

మహిళ

ఉనికి                                        13

నేటి సౌదామిని                           16

మేలుకొలుపు                             21

సాహిత్యం

సాహితీ మార్గదర్శకులు                 25

కలంతో కాసేపు                           30

కథా సమయం                            37    

నేటి కవిత్వం                              43

పుస్తక దర్పణం                           47

కవితామృతం                              51

నవలాముత్యం                             53

సంస్కృతి                                    59

 

 

యువత

ఆలోచిద్దాం! అడుగులు వేద్దా౦!   64

కార్య దీక్షితులు                           67

జిజ్ఞాస                                      70

 

రాజ్యం

సందర్భం                                   68

మరోవైపు                                  75

ప్రాంతీయం                                 77

 


సినిమా

గత సినీ వైభవాలు                       80

సెల్యులోయిడ్ దర్పణం                82

సమాలోచన 

ఉగాది పండుగ అంటేనే షడ్రుచుల సమ్మేళనం.  చిరు వేప పూత. .  మామిడి కాత. .  పులుపులో పులకింతతో పాటు ఆరు రుచులతో పాటు ఆనందంగా ఆరంభించే తెలుగు నూతన సంవత్సరమే ఉగాది పండుగ. 

ఈ షడ్రుచులలో ఒక్కో రుచికి,  ఒక్కో పదార్థానికి ఒక్కో భావానికి ప్రతీక అని పెద్దలు చెబుతుంటారు.  బెల్లంలో ఉండే తీపి ఆనందానికి. .  ఉప్పులో ఉండే గుణం మన జీవితంలో ఉత్సాహానికి,  వేప పూతలోని చేదు మన జీవితంలో బాధ కలిగించే అనుభవాల గురించి,  చింతలోని పులుపు. .  మనం నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను,  మామిడి ముక్కలలోని వగరు వంటి రుచులు. .  కొత్త సవాళ్ల గురించి. .  ఇక చివరగా కారం విషయానికొస్తే మనల్ని సహనం కోల్పేయేటట్టు చేసే పరిస్థితులను గుర్తు చేస్తుంది. 

ఉగాది ప్రాముఖ్యంచైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు.  మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి.  బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా  సృష్టించాడంటారు.  అంటే కాలగణాన్ని గ్రహ,  నక్షత్ర,  రుతు,  మాస,  వర్ష,  వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన.  అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది.  అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను   జరుపుకుంటారు.  శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ. ”ఉగాది”,  మరియు “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి.  “ఉగ” అనగా నక్షత్ర గమనం.  నక్షత్రగమనానికి ‘ఆది’ ‘ఉగాది’. అంటే సృష్టి ఆరంభమైనదినమే “ఉగాది”.  ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము.  ఉత్తరాయణ,  దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా,  ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది.  యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. 

ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ,  తమిళులు పుత్తాండు అనే పేరుతో,  మలయాళీలు విషు అనే పేరుతోను,  సిక్కులు వైశాఖీ గానూ,  బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు. 

ఆవిర్భవ పాఠకులందరికి ఉగాది శుభాకాంక్షలతో . . . 

మీ నేస్తం

టీం ఆవిర్భవ