విషయసూచిక
లైఫ్ స్టైల్స్
మనలో ఒకరు 4
ఫ్యాబ్ లివింగ్ 9
ఆరోగ్య వాణి 13
మహిళ
శక్తి 16
నేటి సౌదామిని 19
మేలుకొలుపు 24
సాహిత్యం
సాహితీ మార్గదర్శకులు 27
కలంతో కాసేపు 32
నేటి కవిత్వం 38
కథా సమయం 40
పుస్తక దర్పణం 45
కవితామృతం 49
నవలాముత్యం 51
సంస్కృతి 55
యువత
ఆలోచిద్దాం! అడుగులు వేద్దా౦! 61
కార్యభారతం 64
జిజ్ఞాస 66
రాజ్యం
సందర్భం 68
మరోవైపు 72
ప్రాంతీయం 75
సినిమా
గత సినీ వైభవాలు 77
మా తత్వం
సమాలోచన
అంతా చేసినా, ఇంకా మీకు సంతోషం లేదంటే, ఎక్కడో మీరు జీవితం యొక్క మూలాలు కోల్పోయారు. మీ చిన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవారు? ఏమీ చేయకుండానే సంతోషంగా ఉండేవారు. కానీ దారిలో ఎక్కడో మీరు దాన్ని పోగోట్టుకున్నారు. ఎందుకని? మీరు మధ్యలో ఎన్నో ఇతర వస్తువులను - మీ శరీరం, మీ మనస్సులను - మీరుగా భావించడం మొదలుపెట్టారు. మీరు నా మనస్సు అనుకునేది, కేవలం అక్కడా, ఇక్కడా వివిధ సామాజిక పరిస్థితుల్లో ఏరుకొచ్చినదే. మీరు ఎలాంటి సంఘాన్ని చూసారో దానిని బట్టే మనస్సుని పోగేసుకున్నారు.ఈ బాధకంతటికీ మూలం ఏమిటంటే, మీరు కాని వాటితో మీరు గుర్తింపు ఏర్పరచుకున్నారు.
ప్రస్తుతం మీ మనస్సులోని అన్ని విషయాలూ, మీరు ఎక్కడో పోగేసుకున్నవే. ఈ చెత్తంతా మీరు జన్మతః తెచ్చుకున్నది కాదు. అక్కడా, ఇక్కడా పోగేసుకున్న చెత్తని “ఇదే నేను” అని భావించడం మొదలు పెట్టారు. ఈ అపోహ బాగా ముదిరి మీకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. “ఇదే నేను” అని మీరు అనుకోనంత వరకూ, మీరు ఏ చెత్తను పోగేసుకున్నా పరవాలేదు. ఈ శరీరం మీరు కాదు, దీన్ని మట్టినుండి పోగేసుకున్నారు. మీరు ఓ చిన్న శరీరంతో పుట్టారు, మీ తల్లిదండ్రులు మీకిచ్చినది. మీరు మొక్కలూ, జంతువులూ తిని ఇలా పెరిగారు. మీరు దీన్ని మట్టినుండి అరువుదెచ్చుకున్నారు, ఇది మీది కాదు. మీరు దీన్ని కొన్నాళ్లు వాడుకోగలరు, కాబట్టి అనుభవించి పొండి. కానీ “ఈ శరీరం నేనే” అనే అపోహలో మీరు ఎంత మునిగిపోయారంటే, మీరిలా దుఃఖపడడంలో ఆశ్చర్యం లేదు. మీ దుఃఖాలకు మూలం మీరు అసత్యంలో నాటుకుపోవడం. మీరు కాని దానితో, మీరు చాలా గాఢంగా గుర్తింపు ఏర్పరచుకున్నారు.
మన మూలాలను మనమే వెతుక్కోగలము, సవరించుకోగలము. మిమ్మల్ని మీరు తెలుసుకుని మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఆవిర్భవ పాఠకులందరికి హోలీ శుభాకాంక్షలు.