విషయసూచిక
లైఫ్ స్టైల్స్
మనలో ఒకరు 5
ఫ్యాబ్ లివింగ్ 9
ఆరోగ్య వాణి 11
మహిళ
శక్తి 12
నేటి సౌదామిని 16
మేలుకొలుపు 23
సాహిత్యం
సాహితీ మార్గదర్శకులు 27
కలంతో కాసేపు 31
కథా సమయం 35
నేటి కవిత్వం 41
పుస్తక దర్పణం 44
కవితామృతం 55
నవలాముత్యం 56
సంస్కృతి 60
యువత
ఆలోచిద్దాం! అడుగులు వేద్దా౦! 65
కార్యభారతం 69
జిజ్ఞాస 71
రాజ్యం
సందర్భం 73
మరోవైపు 76
ప్రాంతీయం 79
సినిమా
గత సినీ వైభవాలు 81
మా తత్వం
సమాలోచన
శివ అనగా మంగళకరం, శుభప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవుతుంది. మహా శివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చేసుకోవాలి.
ఈ పండుగ రోజు ఈ శివుడిని ప్రధానంగా బిల్వ పత్రాలతో పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేస్తారు. ఈరోజున శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ", శివుని పవిత్ర మంత్రం పఠిస్తారు.
జాగరణము అంటే ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణం. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు
ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. ఈ జాగరణ సమయంలో తామున్న ఇంటి ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు.
వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠిస్తూ శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.
శివరాత్రి రోజు ఆహారం స్వీకరించకుండా ఉపవాసం చేస్తే మంచిదే అది ఆరోగ్యానికి, అంతఃకరణశుద్ధికి ఉపయోగం కాని ఇదే పరమార్థం అనుకోకూడదు. ఉప అంటే దగ్గర.. జీవాత్మ పరమాత్మకు సమీపంలో ఉండడం. గురువుల వద్ద శ్రవణం చేసి తన ఆత్మ పరమాత్మయే అని గుర్తించడమే నిజమైన ఉపవాసం.
ఈ మహా శివరాత్రి పండుగ మీకు సర్వ శుభాలూ చేకూర్చాలని ఆశిస్తూ, ఆవిర్భవ పాఠకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.