విషయసూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒకరు 4 ఫ్యాబ్ లివింగ్ 9 ఆరోగ్య వాణి 11 మహిళ శక్తి 14 నేటి సౌదామిని 17 మేలుకొలుపు 21 సాహిత్యం సాహితీ మార్గదర్శకులు 24 కథా సమయం 27 నేటి కవిత్వం 34 పుస్తక దర్పణం 35 కవితామృతం 38 నవలాముత్యం 40 సంస్కృతి 46 యువత స్నేహస్వరం 51 కార్యభారతం 54 కళా వైభవం 58 జిజ్ఞాస 62 రాజ్యం సందర్భం 63 జీవన చిత్రాలు 66 తెలంగాణం 70 ఆంధ్రా దర్పణం 71 సినిమా గత సినీ వైభవాలు 72 సీరియల్ 75
సమాలోచన
స్త్రీ అభ్యుదయం పథంలో నేడు పయనిస్తూనే ఉంది. ఆ అభ్యుదయ పయనంలో ఎన్నో మలుపులు. ఆ అభ్యుదయం సాహిత్యం,ఉద్యమం,ఇంకా ఎన్నో రీతుల్లో పయనించిన ఫలితాన్ని నేటి స్త్రీ అనుభవిస్తున్నా, ఆ స్త్రీ స్వేచ్చ కొంత మేరకు దుర్వినియోగం కూడా అవుతున్న సందర్భాలు నేడు మనకు కనిపిస్తున్నాయి. మన స్వేచ్చ కోసం ఇంకొకరి ప్రాథమిక హక్కుల్ని బలి చేయకూడదు.ఈ కోణంలో చేజారుతున్న మహిళాభ్యుదయం గురించి ప్రత్యేక కథనం ఈ పక్షం మీ కోసం.
ఈ పక్షం స్త్రీ ప్రధాన అంశంగా రెండు కోణాలు పరిచయం చేయడం జరిగింది. తమ జీవితాలతో స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రముఖ రచయిత్రి జలంధరా చంద్రమోహన్ గారి గురించి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ దర్భా లక్ష్మీ సుహాసిని గారి గురించి, స్త్రీ రుతుస్రావ పరిశుభ్రత గురించి డాక్టర్ ఆలూరి విజయ లక్ష్మి గారి మేలుకొలుపులో ,నేటి స్త్రీ గురుతర పాత్ర గురించి శక్తిలో మీ కోసం.
దేశ భక్తిని ఎలా నేడు ముడి సరుకుగా పరిగణిస్తున్నారో ఈదర శ్రీనివాస రెడ్డి గారి జీవన చిత్రాలలో , యువత కోసం దేవులపల్లి దుర్గాప్రసాద్ గారి స్నేహ స్వరం లో నీ మది చల్లగా, అలాగే టిక్ టాక్ మోజులో పది అప్పుల పాలైన వ్యక్తి గురించి జిజ్ఞాసలో మీ కోసం ఈ పక్షం.
నాటి సాహిత్యాన్ని పరిచయం చేసే క్రమంలో నవలాముత్యం శీర్షికలలో దాశరధి రంగాచార్య గారి చిల్లర దేవుళ్ళు , కవితామృతం పేరున అమృతం కురిసిన రాత్రి ,కథలు ,కవితలు ఈ పక్షం మీ కోసం.
ఐదు దశాబ్దాలుగా నటనా ప్రస్థానంలో తనదైన ముద్రతో కొనసాగుతూ పలు పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న చంద్రమోహన్ గారి గురించి ప్రత్యేక కథనం గత సినీ వైభవాలలో.నాటి చాణక్యుడు నేటి రాజకీయ వ్యవస్థను ఎలా మారుస్తాడు అన్న కథాంశంపై చణక్ ఆర్య సీరియల్ కూడా మీ కోసం ఈ పక్షం.