విషయసూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒకరు 4 ఫ్యాబ్ లివింగ్ 8 ఆరోగ్య వాణి 10 మహిళ శక్తి 13 నేటి సౌదామిని 16 మేలుకొలుపు 20 సాహిత్యం సాహితీ మార్గదర్శకులు 22 కథా సమయం 24 నేటి కవిత్వం 32 పుస్తక దర్పణం 34 కవితామృతం 38 నవలాముత్యం 39 సంస్కృతి 45 యువత స్నేహస్వరం 50 కార్యభారతం 53 కళా వైభవం 56 జిజ్ఞాస 61 రాజ్యం సందర్భం 63 జీవన చిత్రాలు 66 తెలంగాణం 70 ఆంధ్రా దర్పణం 71 సినిమా సినీ హోరు 73 సీరియల్ 76 మా తత్వం
సమాలోచన
సమిష్టిగా స్పందించండి!
-రచనశ్రీ దత్త
ఈ సమాజంలో ఒకరైన మనందరికీ పౌరులుగా ఎన్నో హక్కులు ఉన్నాయి.మనం బ్రతికే ఈ సమాజంలో ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మిగిలిన సమాజం స్పందించాల్సిన కనీస బాధ్యత అయితే ప్రతి పౌరుడికి కచ్చితంగా ఉంది. కానీ ఏవో తెలియని భయాలు, అపోహలతో అందరూ సమిష్టిగా ఉండి, ఎదుర్కోవాల్సిన అన్యాయాలను కూడా మనకెందుకులే అని పరిపాటిగా తప్పించుకోవడం నేటి శైలిగా మారిపోయింది.
కానీ జరిగేది ఏ ఒక్కరితోనో ఆగదు. ఒకరితో మొదలైంది తిరిగి తిరిగి ఏదో ఒక రోజు మన ముంగిట్లో కూడా నిలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ సంఘటితం కాకపోవడానికి కారణాలు పౌరులుగా మనకున్న హక్కులు, రాజ్యాంగం మనకు ప్రసాదించిన భద్రత గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే.
ప్రజాస్వామ్యం అనేది మాటలకే పరిమితం అయితే మనకున్న హక్కులను మనమే చేతులారా నిర్వినియోగం చేస్తున్నట్టే. కానీ మనం ఉపయోగించుకొని మన హక్కుల్ని మన బలహీనతగా భావించి ఎందరో తమ ఆసరాగా మలచుకుని మనలో ఒకరైన పౌరులపై వారి పౌరుల హక్కుల్ని కాలరాస్తే స్పందించాల్సిన బాధ్యతను మనమందరం గుర్తు చేసుకుంటే తప్ప ప్రజాస్వామ్య ప్రవృత్తి మన సమాజంలో నిలబడదు.
సమాజం, వ్యవస్థలో ఉన్న లోటు పాట్ల గురించి మనమందరం చక్కగా ఉపన్యాసాలు ఇవ్వగలము, కానీ మనలో ఎంతమంది దానికి బాధ్యతగా వ్యవహరించే ధోరణిని అవలంబించగలరు? బాధ్యత తీసుకుని ఎంతమంది సమిష్టిగా స్పందించగలరు? వీటికి సమాధానం సహేతుకంగా ఎవరికి వారు ఇవ్వాల్సిందే. ఆలోచించండి, మీ హక్కుల పట్ల మీరు తీసుకునే బాధ్యత, సమిష్టిగా స్పందించే శైలి సమాజంలో అలవడినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్య పునాదులు బలపడతాయి.
నేడు సామాజిక మాధ్యమాల ప్రభావం మన జీవితాన్ని సైతం మార్చే స్థాయిలో ఉంది. ఆ మాధ్యమాలలో ప్రదర్శించే బాధ్యత ఆచరణలో కూడా సాధ్యమైతేనే మనందరం సమిష్టిగా ఏ అన్యాయాన్ని అయినా సరే ఎదిరించగలం. ఒక్కసారి ఈ విషయాన్ని గురించి కూడా ఆలోచించండి.
***