logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Pranathi Maasa Patrika 6th Edition January 29th 2021
Pranathi Maasa Patrika 6th Edition January 29th 2021

Pranathi Maasa Patrika 6th Edition January 29th 2021

By: Avirbahva Publishers
  • Pranathi Maasa Patrika 6th Edition January 29th 2021
  • Avirbahva Publishers
  • Language - Telugu
  • Published monthly

About this issue

విషయ సూచిక 

వేదం

విశ్వబ్రహ్మాండమే సద్గురువు        3

ప్రాణశక్తి          7

మహోపదేశం భగవద్గీత 11

క్రాంతి                                       13

జీవం

దిక్సూచి 18

జైన క్షేత్రాలు, బసదులు 20

రవీంద్రనాథ్ టాగూర్ 23

వివేచన 

కొడుకు 24

సుందరకాండ వైభవం 26

శివం శుభకరం            29                  

 తత్వం

జీవితం  ఓ పండగ 32

 

About Pranathi Maasa Patrika 6th Edition January 29th 2021

దృక్పథం

కులమనేది జాడ్యమే

అభి జాత్య ముననే యాయు వున్నంతకు.            

తిరుగుచుండు భ్రమల తెలియ లేక.                    

మురికిభాండమునను ముసరు నీ గలరీతి.            

విశ్వదాభిరామ వినురవేమ..!                                

   కులం...కులమనే కుత్సిత జగతిలో మానవుడు జీవించినంత వరకు సమాజ పురోగతి వుండదు..అయినా, ' కులం ' అనే గోడలు పటిష్ట పునాదులతో నిర్మించు కుంటు వుంటారు చాలా మంది. ఏలి కలు సైతం కులాల కుంపట్లు రాజేసి తమ తమ పబ్బాలు గడుపు కుంటు వుంటారు. ఎక్కువ, తక్కువ కులాలంటు విభజన రేఖలు గీస్తూ ఉంటారు. రిజర్వేషన్ లకు అంకురార్పణ జరిగేది ఇటువంటి సందర్భాలలో నే.                             

తక్కువ కులాలలో ' లేమి ' కలవారు ఉండరు. అగ్ర కులాలలో ' కలిమి ' కలవారు ఉండరు. ఏ కాలమైనా తామూ రిజర్వేషన్ల అర్హత పొందాలని అనుకుంటుంది. ఎందుకంటే, ప్రభుత్వాల ద్వారా అనేక ప్రయోజనాలు పొందాలనే కాంక్షతో.. ' కులాల ' పేరిట రిజర్వేషన్లు ప్రతిభను అణచి వేస్తుంటాయి.. ఈ సంగతి పాలకులకు తెలుసు. ఓటు బ్యాంక్ రాజకీయాల వలన ' కులాలను ' వాడుకుంటూ ఉంటారు వారు. ఇది మన ' ఇండియా ' వంటి దేశాల లోనే కనిపిస్తుంది. అగ్రరాజ్యాల లో మచ్చుకు కూడా ఈ కులాల విభజన ఉండదు. ప్రతిభకు పట్టం కట్టాలని అనుకుంటే ఇటువంటి కులాల విభజన ఉండకూడదు. అయితే ఇందుకు ఏ రాజకీయ పార్టీ సాహసించదు.                                                 

     కులమనే  సమస్య తలెత్తకుండా ఉండేది ఒక్క ' వల్లకాటి ' లోనే..అగ్ర కులస్తుడిని తగల పెట్టిన స్థలం లోనే దళితుడి ఖననం జరగ వచ్చు. అప్పుడు ఎక్కడ ఉంటుంది కులభేధం.. ' గాలికి కులమేది.. నీటికి కులమేదీ ' అని ఒక పాటలో పేర్కొన్నాడు ఒక కవి. అలాగే, ' రక్తానికి ' కూడా కులమేది..ఎందరో రక్తదానాలు చేస్తుంటారు..ఎవరి రక్తం ఎవరికి ఎక్కుతుందో..ఆపద గట్టెక్కడమేగా కావలసింది.                                                                

  కులమనే భ్రమలో సమాజం ఈత కొట్టినంత వరకు.. ఒడ్డనేది తెలియనంత అభిజాత్యంలో మునిగినంత వరకు మానవుడు ' కూపస్త మందుకమే.

                                                                               - పంతంగి శ్రీనివాసరావు                                                                              ఎడిటర్ - ఇన్ - చీఫ్