విషయ సూచిక వేదం వేద విభజన 3 ప్రణవం మహా మంత్రం 6 వైదిక ధర్మం 9 జీవులు అందరూ పశువులే నా! 12 జీవం దిక్సూచి 14 సర్వం శక్తి స్వరూపమే 17 గురూజీ రవిశంకర్ 21 వివేచన విరాజ దీక్ష 24 ఏది సత్యం? ఏది వాస్తవం? 29 మూడు విషయాలు 32 తత్వం ప్రతిధ్వని 35
దృక్పథం అత్యాశ వినాశ హేతువు అడవియడవి తిరిగి యాసను విడలేక. గాసిపడెడువాడు ఘనుడుకాడు. రోసిరోసి మదిని రూఢిగా నిల్పిన. వాడే పరముగన్న వాడు వేమ! మానవునికి ఆశ ఉండాలి. ఆ ఆశే అత్యాసగా మారితే... అది అతని పాలిట వినాసనా నికే దారి తీస్తుంది. ఇది నిజంగా నిజం. పురాణాల్లో నూ ఇందుకు ఎన్నో ఉదంతాలు.. రుజువులు.. రావణుడి ది అత్యాశే.. దుర్యోధనుడు దీ అలవి మాలిన ఆశే..వీరిద్దరూ ఎలా పతనం అయ్యారో పురాణాలు ఎరిగిన అందరికీ విదితమే...! ఎంత సంపద ఉన్నా.. కడుపుకు తినేది కూసింత అన్నమే.. చాలామంది విపరీతంగా కూ డబెడతారు.. వారిలో అక్రమార్జులు ఎందరో.. కడుపునిండా తిందామంటే వారిలో రకరకాల రోగాలు.. అంత సంపాదన అవసరమా.. అంటే అది అంతే.. మదిని సంభాలించు కున్నవానికి సంపాదన మీద అంతగా చూపు ఉండదు.. అతని మనస్సు నిశ్చలనం. స్థిరమైన మనస్సు ఆత్మను సంభాలించు కుంటుంది. స్థిత ప్రజ్ఞత కలవాడు సకలాన్ని జయిస్తాడు. ఆశను అదుపులో పెట్టుకుంటాడు. ఆశను అదిమి పెట్టుకున్న వానికి అత్యాశ ఉండదు. అతనికి అలవి మాలిన కోరికలూ ఉండవు. కోరికలను జయించిన వాడు ఎల్లవేళలా మా నసిక ఆనందం పొందుతాడు. అధిక సంపాదన పరుడు తన వారసులను సోమరిపోతులుగా మార్చుతాడు. అతి సంపాదన గర్వహేతువు. సకల సుఖాలకు సంపదే ఆలంబన అనేది నిజమే అయినా వాటికి పరిమితులు ఉండాలి. జీవన చక్రం నడవాలంటే ' విత్తు ' కావలసిందే.. అలాగని కష్టాన్ని మించిన, తెలివి తేటలను మించిన సంపాదన ఆశించడం అభిలషణీయం కాదు. ఆధ్యాత్మిక భావనతో, వేదాంతం కొద్దిగా నయినా ఆలవరచు కుంటే అదే సుఖం... ఆనందం... పంతంగి శ్రీనివాస రావు ఎడిటర్ - ఇన్ – చీఫ్