విషయసూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒకరు 4 ఫ్యాబ్ లివింగ్ 7 ఆరోగ్య వాణి 9 మహిళ శక్తి 11 నేటి సౌదామిని 15 మేలుకొలుపు 19 సాహిత్యం సాహితీ మార్గదర్శకులు 23 కథా సమయం 26 నేటి కవిత్వం 33 పుస్తక దర్పణం 36 కవితామృతం 39 నవలాముత్యం 40 సంస్కృతి 45 యువత స్నేహస్వరం 50 కార్యభారతం 54 కళా వైభవం 57 జిజ్ఞాస 61 రాజ్యం సందర్భం 64 జీవన చిత్రాలు 67 తెలంగాణం 71 ఆంధ్రా దర్పణం 73 సినిమా సినీ హోరు 74 సీరియల్ 78 మా తత్వం
సమాలోచన స్త్రీ శక్తి సింపతీ కార్డ్ కాకూడదు! -రచనశ్రీదత్త స్త్రీ ని ఆది నుండి శక్తి స్వరూపిణిగా కొలిచిన సంస్కృతి మనది. కాలక్రమంలో స్త్రీ తనదైన వ్యక్తిత్వ ముద్రతో ముందుకు సాగిపోతున్న దశాబ్దంలో మనం జీవిస్తున్నాము. నేటి చట్టం కూడా స్త్రీకు విస్తృతమైన హక్కులు ఇచ్చింది. దీని వల్ల నిజంగా బాధితులైన వారి సమస్యలు తీరుతున్నాయా అన్న అంశం ఎంత ఆలోచించాల్సినదో ,అలాగే అదే స్త్రీ అదే చట్టాన్ని కక్ష సాధింపు చర్యలకు ఎలా వినియోగిస్తుంది అన్నది కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం. నిజంగా చట్టం అండ తీసుకోవాల్సిన స్త్రీలు ఆ అడుగు వెయ్యలేక ఇంకా భయపడుతూనే, భయపెట్టబడుతూనే ఉన్నారు. దానికి కారణాలు అనేకం. ఎందుకంటే అవిద్య, పుట్టినప్పటి నుండి పరిస్థితులు నింపిన భయం, కుటుంబానికి ఎదురయ్యే పరిస్థితులు వంటివి కూడా ఎందరో నిజమైన బాధితులైన స్త్రీలను వెనుకంజ వేసేలా చేస్తున్నాయి. ఇది ఓ కోణం. నేటి సమాజంలో దర్శనమిస్తున్న ఇంకో కోణం ఏమిటంటే స్త్రీ భర్తనో లేక అత్తింటి కుటుంబాన్నో బెదిరించడానికి ఈ చట్టాన్ని వినియోగించడం. దీనితో పాటు ఎంతో మంది స్త్రీలు సమాజంలో స్త్రీ కు ఉన్న గౌరవాన్ని తమ అస్త్రంగా వాడుకుంటూ, గొంతు పెద్ది చేసి అరుస్తూ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించటం. మన సమాజంలో ఓ స్త్రీ ఏడ్చి, బిగ్గరగా మాట్లాడుతుంది అంటే అందరూ ఆమె పట్ల సానుభూతి మొదట ప్రదర్శిస్తారు. దానిని సమాజ బలహీనతగా భావించి, అదే సింపతీ కార్డును తన స్వీయ లక్ష్యాల కోసం కక్ష సాధింపుల కోసం వాడుతున్న తరుణం నేడు సమాజంలో పెరిగిపోతూ ఉంది. ఎంతోమంది సమాజంలో స్త్రీ పట్ల జరుగుతున్న అన్యాయాల గురించి మాత్రమే మాట్లాడగలరు, కానీ స్త్రీలకు ఉన్న విశేషంగా లభించిన చట్ట హక్కుల వల్ల బలైపోతున్న వారి గురించి మాట్లాడరు. దానికి కారణం సమాజంలో అందరూ సమస్యను నిష్పక్షపాత కోణంలో కాకుండా స్త్రీ కోణం నుండి మాత్రమే తరచి గమనించడం. దీనిలో ఉన్న ఇంకో దారుణమైన చీకటి కోణం ఏమిటంటే ఎంతో మంది తమ శత్రువులపై అస్త్రంగా కూడా స్త్రీల చేత ఫేక్ కేసులు పెట్టించడం. వీటన్నింటి వల్ల నిజంగా బాధితులైన వాళ్ళకు ఉపయోగపడాల్సిన చట్టం ఇలా స్వీయ కుట్రలకు, కక్ష సాధింపు చర్యలకు అస్త్రంగా మారుతుంది. స్త్రీ తన శక్తిని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే సమాజంలో ఉండే అనుబంధ విలువలు, సంస్కృతి సువాసనలు విరాజిల్లుతాయి. కానీ ఎప్పుడైతే అదే శక్తిని సింపతీ కార్డుగా వినియోగిస్తూ కుట్రలలో భాగం అవుతుందో అప్పుడు జాతి వినాశనంలో కూడా అదే శక్తి ముఖ్యమైన పునాదిగా మారుతుంది. ఆది శక్తి నమో నమః సర్వ శక్తి నమో నమః ప్రథమా భగవతి నమో నమః కుండలిని మాతా మాతా శక్తి నమో నమః ఎడిటర్ ఇన్ చీఫ్