logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Avirbhava Paksha Patrika Edition 26th January 1st 2021
Avirbhava Paksha Patrika Edition 26th January 1st 2021

Avirbhava Paksha Patrika Edition 26th January 1st 2021

By: Avirbahva Publishers
  • Avirbhava Paksha Patrika Edition 26th January 1st 2021
  • Avirbahva Publishers
  • Language - Telugu
  • Published bimonthly

About this issue

విషయసూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒకరు 5 ఫ్యాబ్ లివింగ్ 9 ఆరోగ్య వాణి 12 మహిళ శక్తి 14 నేటి సౌదామిని 17 మేలుకొలుపు 22 సాహిత్యం సాహితీ మార్గదర్శకులు 25 కలంతో కాసేపు 32 కథా సమయం 38 నేటి కవిత్వం 43 పుస్తక దర్పణం 44 కవితామృతం 48 నవలాముత్యం 48 సంస్కృతి 57 గళ్లనుడికట్టు 63 యువత ఆలోచిద్దాం! అడుగులు వేద్దా౦! 65 నేటి కార్య దీక్షితులు 69 జిజ్ఞాస 74 రాజ్యం సందర్భం 76 మరోవైపు 78 ప్రాంతీయం 81 సినిమా గత సినీ వైభవాలు 84 మా తత్వం

About Avirbhava Paksha Patrika Edition 26th January 1st 2021

సమాలోచన     సిద్ధాంతం వినటానికి అందంగానే ఉన్న, ఆచరణ మాత్రం అడివి కాసిన వెన్నెలలాగానే మిగిలింది అన్న మన పెద్దలు చెప్పిన మాట,  ఈనాటి సమాలోచన రాస్తుండగా గుర్తుకువస్తుంది. ఓ పయనం మొదలు పెట్టేటప్పుడు ఎన్నో మార్గదర్శకాలు పెట్టుకొని మొదలై, కొన్ని అధిరోహాలు ఎక్కిన తరువాత ఆ గెలుపు మనకి కొమ్ములవుతాయి, ఆవిర్భవకు నిజం కటువుగా ఉన్న అది ఒప్పుకునే ధైర్యం ఉంది, గత కొన్ని సంచికలుగా ఏదో పత్రిక బయటకు వస్తే సరిపోతుంది అన్న ధోరణకి సాంకేతిక సమస్యల వల్ల , లేక పతాక మహాశయుల్ని  మెప్పించే ప్రయత్నం మా తరపున సరిగ్గా లేకపోవటంవలనో కానీ, మా ఆత్మ విశ్లేషణలో మేము ఆవిర్భవ మొదలు పెట్టిన సిద్ధాంతం నుంచి మాత్రం దూరమైనట్లు అనిపించింది. గత కొన్ని సంచికల్లో ఆ లోపం మాకే స్వీయ విశ్లేషణ చేసుకుంటే కొట్టొచ్చినట్టు కనిపించింది.  గళం మీది, పదం మాది అన్నీ మేము పెట్టుకున్న సిద్ధాంతాన్ని కోవిడ్ సమయంలో ఆచరణగా చేసి మేము సమాజానికి అందించిన స్నేహ హస్తం, జూనియర్ కళాకారుల ఆఖలి తీర్చే ప్రయత్నంగా మొదలైన ఆవిర్భవ సేవా సమితి, మొదలుపెట్టిన రోజుల్లో ఉన్న ఉత్సాహం, మాకు ఎదురు దెబ్బలు తగలటం వల్ల  కొంచం పలుచనవ్వడం, మా వంతు  సమాజ బాధ్యత నిర్వర్తించలేకపోయామనే అనిపించింది. ఆ బాధ్యత  సరిగ్గా నిర్వర్తించలేక పోయినందుకుగాను మమ్ము మేము ఆత్మపరిశీలన చేసుకునే పరిస్థితికి మేము సవినయంగా మేము మా పాఠక దేవుళ్ళకి క్షమాపణలు చెప్పుకుంటున్నాము.  ఈ నాడు మనకి వచ్చే ప్రతి పత్రిక ఓ వ్యాపార దర్పణంగా మారి ఉన్నది అన్న సత్యం, అలానే కొద్ది రోజులు మాముందు కొన్ని చాపల్యాలని పెట్టిన కొంతమందిని ఎదుర్కుని  ఈ రోజు కూడా మా నీతిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే  పత్రికలో ఎటువంటి వ్యాపార ప్రకటనలు లేక తెచ్చే ధైర్యం ఆవిర్భవకు ఉంది, దాని పర్యవసానం ఈ నాడు దాతలు లేక ఆగిన మా వెబ్సైట్, రేడియో  మా నిజాయితీకి దర్పణంగా నిలిచినాయి. తెలుగు సాహిత్య పరిరక్షణ కోసం అడుగు ముందుకు వేయాలన్న,ముందున్నది నిలువెత్తు పర్వతం అన్న నిజం తెలిసినా,గుండె నిబ్బరంతోనే మేము ముందడుగు వేయదలిచాము.   అందుకే  మమ్మల్ని మేము మొదట్లో ప్రతి కొత్త సంచికలో ఓ కొత్తదనాన్ని పరిచయం చేస్తూనే వినూత్న శీర్షికల వెల్లువగా మార్చాలని ఈ సారి నుండి పత్రికలో పాత శీర్షికల బదులు  కొత్త శీర్షికలను ప్రవేశపెట్టాము. అందులో  పాఠకులకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిస్తూనే, వారికి సాహిత్యం పట్ల అవగాహన పెంచే దిశలో భాగంగా ఆవిర్భవ  రథ సారధి అయిన శ్రీ దేవులపల్లి దుర్గాప్రసాద్ గారు నిర్వహిస్తున్న  గళ్ళ నుడి కట్టు, సమకాలీన సాహితీవేత్తల అంతర్మథనాన్ని పాఠకులకు పరిచయం చేయడానికి ‘కలంతో కాసేపు’ శీర్షికలను సాహితీ విభాగంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే  యువత విభాగంలో యువతను ఆలోచించే దిశలో ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్  అమరనాథ్ జగర్లపూడి గారి కొత్త శీర్షిక ‘ఆలోచిద్దాం! అడుగులు వేద్దాం!’,రాజ్యం విభాగంలో జంధ్యాల రఘుబాబు గారి ‘మరోవైపు’,  ఈ పక్షం నుండి మీ కోసం. ఈ సంచిక నుండి వినూత్న డిజైన్ తో కూడా మరో అడుగు ముందుకు వేస్తున్నాము. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని  ఆశిస్తూ, నూతన సంవత్సర -సంక్రాంతి శుభాకాంక్షలతో ..... మీ  ఆవిర్భవ కుటుంబం