విషయసూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒకరు 4 ఫ్యాబ్ లివింగ్ 8 ఆరోగ్య వాణి 11 మహిళ శక్తి 14 నేటి సౌదామిని 17 మేలుకొలుపు 23 సాహిత్యం సాహితీ మార్గదర్శకులు 27 కథా సమయం 31 నేటి కవిత్వం 38 పుస్తక దర్పణం 39 కవితామృతం 46 నవలాముత్యం 48 సంస్కృతి 52 యువత స్నేహస్వరం 59 కార్యభారతం 62 కళా వైభవం 65 జిజ్ఞాస 69 రాజ్యం సందర్భం 72 జీవన చిత్రాలు 75 ప్రాంతీయం 79 సినిమా గత సినీ వైభవాలు 82 మా తత్వం
సమాలోచన ఆవిర్భవ పక్షపత్రికగా ఆవిర్భవించి సంవత్సరం పూర్తి అయ్యింది. ఈ సంవత్సర పయనంలో నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నా సరే, ప్రతి ఇబ్బందిని అధిగమిస్తూ ఆవిర్భవ తన ఉనికిని నిలుపుకుంటూ ముందుకు సాగుతుంది. కానీ కొందరు ప్రత్యర్ధులు మాత్రం తమ స్వలాభాల కోసం సాహితీవేత్తలై ఉండి కూడా ఆవిర్భవ మీద, ఆవిర్భవ తరపున వస్తున్న ఆధ్యాత్మిక మాస పత్రిక అయిన ప్రణతి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేడు తెలుగు సాహితీవేత్తల్లో కొందరు ఆవిర్భవ స్థాయిలో పత్రికను నడపలేకపోవడం వల్ల వాట్సప్ బృందాలు, సాహితి సంస్థలు సభ్యత్వం మీద స్థాపించి, తమ పాపులారిటీ పెంచుకుంటూ, దానితో పాటు తమతో కలిసి ఉన్న రచయితల మనసుల్లో పోటీగా ఉన్న పత్రికల మీద విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆవిర్భవ దృష్టికి వచ్చింది కనుక మేము చెప్పేది ఒకటే. ఆవిర్భవ మాకు కాలక్షేప సమయంలో రచయితల వేదికగా నెట్వర్క్ పెంచుకునే సంస్థ కాదు. ఆవిర్భవతో మేము కరోనా సమయంలో కానీ, నేడు చిత్రపురి కాలనీ సమస్యల్లో కానీ పత్రిక నిర్వహించాల్సిన పాత్రను నిర్వహించామని సగర్వంగా చెప్పుకోగలము. కేవలం వివాదాల్లో చిక్కుకుంటామని భయపడి కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలు ఏవైతే మా దృష్టికి వచ్చాయో వాటిని మేము ప్రజల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉంటాము. కనుక ఓ పత్రిక ఆర్థికంగా బలమైనది కాకపోయినా సిద్ధాంత విషయంలో గట్టిగా ఉన్నప్పుడూ దానికి ప్రోత్సాహం అందించకపోయినా, దాని మీద బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమో ఆ గొప్ప సాహితీవేత్తలకే తెలియాలి. విమర్శలకు ఆవిర్భవ ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. మమ్మల్ని నిత్యం మేము మెరుగుపరుచుకోవడానికి మేము సిద్ధం. కానీ అది విమర్శగా కాకుండా కక్షపూరిత చర్యగా మారితే అది సాహితీ శ్రేయస్సుకు సమంజసం కాదు. కొందరు వాట్సప్ బృందాల్లో ప్రణతి మాస పత్రికపై ఏవో కంప్లెయింట్లు ఉన్నాయని చేసిన కామెంట్స్ మా వరకు వచ్చాయి కనుక, అవి మా దృష్టికి తీసుకువస్తే, తప్పకుండా ప్రణతి విషయ విషయంలో ఏదైనా లోపం ఉంటే సరి చేసుకుంటాము. కేవలం వ్యక్తిగత ఎజెండాలతో అలాంటి కామెంట్స్ చేస్తే అది మీ సాహితీ మనసాక్షికే వదిలివేస్తున్నాము. మీ టీం ఆవిర్భవ