సమాలోచన మనిషి జీవితంలో కొత్తగా ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉండటం ఆ వ్యక్తిలోని అంతర్లీన అంతఃచేతనా శక్తిని మేల్కొల్పుతుంది. అలా విభిన్న ఎన్నో ఊహాలోకాలకి మనిషి ఆలోచనా శక్తిని తీసుకువెళ్ళేది పుస్తక పఠనం. స్థానిక వాతావరణం, నివసించే ప్రదేశంలోంచి మన మెదడును, మనసును తీసుకువెళ్ళే ఏకైక శక్తి పుస్తకాలకే ఉంది. బిల్ గేట్స్ , ఇలాన్ మస్క్ వంటి గొప్ప వ్యాపారవేత్తలు కూడా పుస్తకపఠనం తమ జీవితంలో ప్రధాన పాత్రను పోషించాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కాల్పనిక రచనలను చదువుతుంటే ఆ కథాంశంలోని పాత్రలు కథ పూర్తయ్యేవరకు గుర్తుంచుకోవడం, పూర్తయ్యేవరకు ఆ వాతావరణాన్ని మన ఊహా చక్షువుల్లో వీక్షించగలగడం జీవితంలో ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. చదివేటప్పుడు కూడా ఎప్పుడు ఒకే రకం జోనర్స్ కు పరిమితమవ్వకుండా అన్ని రకాలు చదవడం ప్రయత్నిస్తూ ఉంటే అన్ని రకాల కోణాలను జీవితంలో మన ఊహాల్లో దర్శిస్తూ, జీవితంలో కొంత వాటికి సంబంధించిన వాస్తవికత గురించి కూడా అవగాహన పెంచుకోవచ్చు. అలా వివిధ కోణాలను మీకు దర్శింపజేయడానికి ఈ పక్షం కూడా ఆవిర్భవ మీ ముందుకు వచ్చింది. లైఫ్ స్టైల్స్ లో ఉద్యోగాల భవిష్యత్తుపై కరోనా ప్రభావం, ట్రాన్స్ జెండర్ మధుశాలిని జీవన కోణం మీ కోసం. మారుతున్న మాంగల్య బంధాలు, శక్తివంతమైన స్త్రీ గీతామూర్తిగారి గురించి ప్రత్యేక కథనం, స్త్రీల ఆరోగ్యం గురించి మహిళా విభాగంలో మీ కోసం. సాహిత్యంలో పాత సాహిత్యాన్ని పరిచయం చేసే నవలాముత్యం, కవితామృతం, కథలు, నేటి కవిత్వం, పుస్తక దర్పణం, సంస్కృతి సాహిత్య విభాగంలో మీ కోసం. నేటి రాజకీయ పరిస్థితులకు దర్పణంగా రాజ్య విభాగం, యువతకు స్పూర్తినిచ్చే దేవులపల్లి దుర్గాప్రసాద్ గారి స్నేహస్వరం, కార్యభారతం లో సమయపాలన, జిజ్ఞాస యువతలో మీ కోసం. గత సినీ వైభవాల్లో రంగనాథ్ గారి గురించి ప్రత్యేక కథనం సినీ విభాగంలో మీ కోసం. పాఠకులు ఎంతగానో ఆదరిస్తున్న శ్రీనివాస్ గోపీ చంద్ దత్తా గారి 'చణక్ ఆర్య' సీరియల్ కూడా కొత్త మలుపుతో మీ ముందుకు వచ్చింది. ఎప్పటిలానే ఆవిర్భవను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ నేస్తం ఆవిర్భవ