logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Avirbhava Paksha Patrika 20th Edition August 22nd 2020
Avirbhava Paksha Patrika 20th Edition August 22nd 2020

Avirbhava Paksha Patrika 20th Edition August 22nd 2020

By: Avirbahva Publishers
  • Avirbhava Paksha Patrika 20th Edition July 22 2020
  • Avirbahva Publishers
  • Language - Telugu
  • Published bimonthly

About this issue

విషయసూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒకరు 4 ఫ్యాబ్ లివింగ్ 11 ఆరోగ్య వాణి 13 మహిళ శక్తి 16 నేటి సౌదామిని 19 మేలుకొలుపు 25 సాహిత్యం సాహితీ మార్గదర్శకులు 29 కథా సమయం 32 నేటి కవిత్వం 38 పుస్తక దర్పణం 39 కవితామృతం 42 నవలాముత్యం 43 సంస్కృతి 48 యువత స్నేహస్వరం 53 కార్యభారతం 55 కళా వైభవం 59 జిజ్ఞాస 63 రాజ్యం సందర్భం 68 జీవన చిత్రాలు 72 ప్రాంతీయం 72 సినిమా గత సినీ వైభవాలు 74 సీరియల్ 77 మా తత్వం

About Avirbhava Paksha Patrika 20th Edition August 22nd 2020

స్వాతంత్ర్యం కోసం వ్యక్తి,  సమాజం,  ప్రాంతం,  దేశం పోరాడుతూనే ఉన్నాయి.   మొదట పరాయి పాలన నుండి విముక్తి కోసం మొదలైన ఈ సమరం కాల క్రమంలో మనిషికి తనకున్న జీవించే హక్కు గురించి బలమైన అభిప్రాయం ఏర్పడేలా చేసింది.   ఆ జీవించే హక్కు ఇచ్చిన ధైర్యమే నేడు సమాజంలో తనకు జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి పౌరుడికి ఉన్న ఆయుధం.               నిజానికి ప్రతి వ్యక్తికీ తన మనసు నుండీ స్వాతంత్ర్యం లభించాలి.  .  !! తనదైన స్వీయ తంత్రం అర్ధం చేసుకోగల సత్తా కావాలి.   స్వయం కోసం మనం వెతకటం మొదలెడితే .  .  .  .  మనది కాని మనో పాలనా వ్యవస్థ .  .  .   నుండీ విడుదల లభిస్తుంది.  నిజానికీ ప్రతి వ్యక్తీ తాను పుట్టినప్పుడు మాత్రమే సర్వ స్వతంత్రుడు.   క్రమేపీ తన ఉనికి ని నిలుపుకోవటం కోసం ఎన్నో ఆధారాలను చేసుకుని తనను తాను వదిలేసుకున్న స్వయం ఒక నేనుగా తయారవుతోంది.  ఈ క్రమంలో తన స్వచ్ఛతలో ఎన్నో ముద్రలను ప్రతిబింబిస్తూ తన స్వీయ ధర్మ చక్రాన్ని,  తన స్వతంత్రతను కోల్పోయింది.              పర పాలన నుండీ స్వతంత్రం సంపాదించిన వారు మన పూర్వీకులు అంటే మన జన్యువులకు పరపాలన పీడన లేదు కానీ,  నేను అనుకుంటున్న  మనసూ,  బుద్ధీ,  చిత్తముల పరపాలన స్వయం మీద ఇంకా ఉండనే ఉంది.  అది మనకు బాహ్యంలో పరిస్థితులను సృజిస్తోంది.              ఈ అలనాటి స్వాతంత్ర్య దినోత్సవ సంరంభంలో.  .  .  మన స్వయం తంత్ర స్వతంత్ర తను మనం మనం విధిగా గుర్తు చేసుకుందాం.   చేయవలసింది రాస్తారోకోలూ,  ఉప్పు సత్యాగ్రహాలూ కాదు.  స్వయాన్ని దేహంతో,   మనసుతో  జోడిస్తూ ఉన్న శ్వాసను నిరంతరం గమనించటం తో.   దేవుడైన జీవుడిని జీవునిగా జీవింప చేస్తూ,  జీవుడిని దేవుడిగా పరిమారుస్తూ ఉన్న నీ శ్వాసతో కలసి ఉండటం.  సర్వ తంత్ర స్వతంత్రతను మనకు అందించేందుకున్న అతి తేలికైన ఋజువైన శ్వాస మీద ధ్యాసతో కలసి ఉండటం.   సనాతన సాధన ను సనూతనంగా వ్యక్తి గతంగా ప్రతి వ్యక్తీ ఆచరిస్తూ,  నవ్య నూతనంగా కనిపింప చేసే స్వయం ప్రకాశాన్ని భారతీయ  సా౦ప్రదాయంగా ప్రభవింపచేసుకోవటం,  స్వతంత్రతను సాధించటం.