మనలో ఒక్కరు 3 ఫ్యాబ్ లివింగ్ 6 మహిళా శక్తి 10 నేటి సౌదామిని 13 మేలుకొలుపు 17 రాంపా కార్టూన్ కెచెప్ 21 సాహిత్యం సాహితి మార్గదర్శకులు 22 కథ సమయం 25 నేటి కవిత్వం 33 పుస్తక దర్పణం 35 సంస్కృతి 37 యువత స్నేహ స్వరం 43 కార్య భారతం 45 జిజ్ఞాస 51 రాజకీయం సందర్భం 53 జాతీయం 55 తెలంగాణం 60 ఆంధ్ర దర్పణం 61 సినీ దర్పణం గత సినీ వైభవాలు 62 సినీ హోరు 65 సీరియల్ 69 మా తత్వం 74
సంపాదకీయం
మణి గోవిందరాజుల
కొత్త సంవత్సరంలో మొదటి నెల జీవితంలో మనం కలలు కనే ఎన్నో ఆశయాలకు పునాది. మనం వేసుకున్న ప్రణాళికలు, తీసుకున్న కొత్త నిర్ణయాలు ఏ మేరకు అమలు చేస్తామో తెలిపేది ఈ జనవరే. ఈ నెలలో మొదటి 21 రోజులు క్రమం తప్పకుండా మనం తీసుకున్న కొత్త నిర్ణయాల అమలులో ఉత్సాహం చూపిస్తే అది కచ్చితంగా ఓ అలవాటుగా మారుతుంది. ఎందుకంటే ఏ విషయమైనా 21 రోజులు సాధన చేస్తే అది మన జీవితంలో ఓ అలవాటుగా మారుతుంది అన్నది శాస్త్రీయ పరిశోధనలతో నిగ్గు తేలిన నిజం.
ఈ నెలలో మీరు తీసుకున్న కొత్త నిర్ణయాన్ని అయినా , కొత్త లక్ష్యాన్ని అయినా సరికొత్త ఉత్సాహంతో అమలు పరచండి. మన జీవితంలో అటువంటి ఉత్సాహాన్ని నింపే సంక్రాంతి సంబరాలు ఇంకో వారంలో రాబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జీవితంలో సంబరాన్ని నింపుకోండి.
వయసు మనసుకి సంబంధించిందే తప్ప, శరీరానికి కాదు అని ఎంతోమంది నిరూపించారు. స్వామి వివేకానందుని జన్మ దినోత్సవం సందర్భంగా మనం జరుపుకునే యువజన దినోత్సవం దీనికి ఓ ప్రతీక. ఈ సందర్భంగా మనసులోని సంకోచాలను పక్కన పెట్టి, నిత్య ఉత్సాహంతో ఈ 2020 నీ మీ జీవితంలో ఓ ఉత్సాహ హోరుగా నిలిచిపోయే మీ అభిరుచులతో, మనసనే డైరీ లో ఎప్పటికీ మిగిలిపోయే ఓ మధుర జ్ఞాపకంగా మలచుకోండి.
మన నిత్య జీవితంలో భాగమైన ఓ భాగం కంప్యూటర్ నేడు. అటువంటి కంప్యూటర్ వాడకంలో మునిగిపోయి మనం తెలియకుండానే చేస్తున్న నిర్లక్ష్యం వల్ల సంభవించే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, సంస్కృతంలో భాగమైన సంక్రాంతి,యువ జన దినోత్సవం సందర్భంగా ఎంత మందికో ఆదర్శంగా నిలుస్తున్న యువత, సమకాలీన రాజకీయ స్థితి గతులను ప్రతిబింబించే అంశాలు, ఘోస్టింగ్ వంటి ఆసక్తి కలిగించే అంశాలు ...ఇలా ఎన్నో వైవిధ్య భరిత విషయాలతో ఈ 2020 లో వస్తున్న ఈ ఆవిర్భవ పక్ష పత్రిక కూడా మీలో ఆ పఠానోత్సాహాన్ని మరింత వృద్ధి చేయడానికి మీ ముందుకు వచ్చింది.
ఆవిర్భవ పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆవిర్భవ పై మీ ఆదరణ ఈ నూతన సంవత్సరంలో కూడా అలాగే కొనసాగుతుందని ఆశిస్తూ మళ్ళీ వచ్చే పక్షం కలుసుకుందాం.