కాలచక్రం గంటల పంచాంగం Kalachakram Gantala Panchangam ఉగాది, యుగాది అనే రెండు పదాలూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తాయి. యుగాది అనేది సంస్కృత పదం. ఇదే కాలక్రమంలో ఉగాదిగా మారిందని భాషావేత్తలు చెబుతున్నారు. దీన్ని పలు రకాలుగా వివరించారు. * ‘ఉగస్య ఆదిః ఉగాది’ – ఉగము అంటే నక్షత్రగమనం అని అర్థం. నక్షత్ర గమనానికి ప్రారంభపు రోజు.. అంటే ఈ రోజు నుంచి నూతన కాలగణన ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజుకు ఉగాది అనే పేరు వచ్చింది. * మరో వివరణ ప్రకారం ఉగము అనే పదానికి జన్మ, ఆయుష్షు అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటిప్రకారం విశ్వ జననం, ఆయుష్షులకు మొదటిరోజు కాబట్టి ఈ రోజుకు ఉగాది అనే పేరు వచ్చింది. * ఇంకో రకంగా చూస్తే ‘యుగము’ అంటే జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన కాలప్రమాణాలున్న సంపూర్ణ సంవత్సరానికి ఇది తొలిరోజు కాబట్టి ఈ రోజుకు యుగాది అని పిలిచారు. * కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ‘పంచవత్సరో యుగమితి’ – ఐదు సంవత్సరాలు ఒక యుగం అంటూ ‘యుగం’ అనే భావనకు నిర్వచనం ఇచ్చాడు. జ్యోతిశ్శాస్త్రం కూడా ఇదే భావనను సమర్థించింది.