రెండో చుట్టు పోటీ ఆరంభమే ఇద్దరూ చాలా భీకరంగా తలపడ్డారు. చూడ్డానికది ద్వంద్వ యుద్ధంలా లేదు. బద్ధశత్రువుల పోరులావుంది. ముఖ్యంగా యువరాణి ఋగ్వేదకి ఈ పోటీని త్వరగా ముగించాలనుంది. రెండో చుట్టు కూడ తను జయిస్తే ఇక మూడో చుట్టుతో పనిలేదు. రెండుసార్లు ఎవరు జయిస్తే విజయం వారిదే గదా!. ఈ సారి కూడ తనే జయించి మార్తాండవర్మను మట్టికరిపించి తిరిగిచూడకుండా అతన్ని కళింగ సరిహద్దుల వరకు తరిమికొట్టాలన్న పట్టుదలతో చెలరేగి పోరాడుతోంది. ఆరంభంలో కొద్దిసేపు మాత్రం బలంగా ప్రతిఘటించాడు మార్తాండవర్మ. తర్వాత ఆమె ఖడ్గ ప్రహారాల్ని తన డాలుతో కాచుకుంటూ ఆత్మరక్షణ దిశలో వెనక్కి వెనక్కి అడుగులేయనారంభించాడు. ఒకటి..... రెండు ..... మూడు.... క్షణాలు ఉద్విగ్నంగా దొర్లిపోతున్నాయి. అంతలో...........