చాణక్య నీతి • లక్ష్మీ ప్రాణ, జీవన, శరీర, ఇవన్నీ పోయేవే. కేవలం ధర్మం మాత్రమే స్థిరంగా ఉంటుంది. • వందమంది మూర్ఖులకంటే గుణవంతుడైన పుతృడొకడు చాలు. వేలకొలదీ నక్షత్రాలు పారద్రోలలేని చీకటిని చంద్రుడొక్కడు తరిమేయగలడు. • తల్లిని మించిన దైవము లేదు. • పుతృడికి ఉత్తమమైన మంచి విద్యనొసగుట తండ్రికి అన్నిటికన్నా పెద్ద కర్తవ్యము. • దుషుడికి శరీరమంతా విషమే. • దుషులు మరియు ముల్లు అయితే జోడుతో తొక్కేయాలి లేకపోతే దారిలోంచి తీసి పారేయ్యాలి. • డబ్బు ఉన్నవాడికి ఎక్కువ మంది స్నేహితులు, సోదర బంధువులు మరియు చుట్టాలు ఉంటారు. • భూమి మీద అన్నము, నీరు, మరియు సుభాషితములు అన్న మూడు రత్నములు ఉన్నాయి. మూర్ఖులు ఉత్తినే రాళ్లకిరత్నాలని పేరుపెట్టేరు. • బంగారంలో సువాసన, చెరకునుండి పండ్లు, గంధం చెట్టుకి పువ్వులు ఉండవు. విద్వాంసుడు ధనవంతుడు కాలేడు మరియు రాజు దీరాయువు కలవాడు కాలేడు. • ఆ సరిసమాన హెూదా గలవారి మధ్యే స్నేహం శోభనిస్తుంది. • తన కంఠస్వరమే కోకిలకు రూపము. పతివ్రతగా ఉండడంలోనే స్త్రీకి సౌందర్యము.