‘సమ’ ఆలోచన, ‘సరి’ ఆలోచనా, సక్రమమైన ఒకే ఆలోచన.... పలువురిలో ఒకేసారి కలిగించగలిగినదే సాహిత్యం. అదే సాహిత్య పరిమళం – ఆ పరిమళావిర్భావమే మన ‘ఆవిర్భవ.’ ఒకే కాలంలో, ఒకే సమయంలో రచనలని చేసే రచయితలు లేదా రచయిత్రుల రచనల మేలుకలయిక ఈ సమాలోచనలో ఉన్నది. ఇదొక పన్నిటి జల్లు -పలకరించే- చక్కటి సమాలోచన-ఒక ఆనందపు రవళి ..ఉత్సాహానికి మారు పేరు.
ఈ సంచికలో ఎన్నో ఉపయోగకరమైన అంశాలు మీ కోసం పొందుపరిచాము. తెలంగాణ రాష్ట్రం నుండి తొలి కేంద్ర సాహిత్య ఏకాడమీ యువ పురస్కారం పొందిన డాక్టర్ పసునూరి రవీందర్ గారి గురించి ప్రత్యేక కథనం,ఫ్యాబ్ లివింగ్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో వినియోగదారులు పాటించాల్సిన జాగ్రత్తలు, మనం నిత్య జీవితంలో ఓ భాగమైన కాఫీ గురించి ఆరోగ్యవాణిలో మీ కోసం లైఫ్ స్టైల్స్ లో .
పాఠ్యాంశాల్లో కూడా అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న వివక్ష గురించి శక్తిలో, కలం సమాజ శ్రేయస్సు కోసమని నమ్మి సాహితీవేత్తగా, కణిక బృంద అడ్మిన్ గా సాగుతున్న రమాదేవి కులకర్ణి గారి గురించి నేటి సౌదామినిలో ,ఋతుస్రావం కలుషిత రక్తమా అన్న అంశం గురించి మేలుకొలుపు కలిగించే డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిగారి ఆర్టికల్ మీ కోసం మహిళా విభాగంలో.
సరస్వతి పుత్రులైన పుట్టపర్తి నారాయణాచార్యులు గారి గురించి, వినూత్న పుస్తకాన్ని పరిచయం చేస్తూ పుస్తక దర్పణం, నవలాముత్యంలో దాశరధి రంగాచార్యులు గారి చిల్లర దేవుళ్ళు మూడో భాగం, కవితామృతం లో దేవరకొండ బాల గంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి 3 వ కవిత, కణిక -ఆవిర్భవ సంయుక్తంగా నిర్వహించిన కవితా పోటీలో బహుమతి పొందిన వినీల గారి కవిత కనిపించే వెలుగు , ఉగాది మీద ప్రత్యేక కథనం కాళంరాజు వేణుగోపాల్ గారి సంస్కృతిలో మీ కోసం. నేటి యువత గురించి ఆసక్తి కలిగించే అంశాలు మీ కోసం యువత విభాగంలో.
శ్రీమంతుడు సినిమా చూసినప్పుడు మనందరికీ మన స్వగ్రామాల పట్ల ఓ రకమైన ప్రేమ కలుగుతుంది. కానీ మన బిజీ జీవితాల్లో పట్టించుకునే తీరిక, ఆసక్తి మిగిలే అవకాశం ఉండదు. కానీ తమ గ్రామం కోసం పాల్పడుతున్న నిజమైన శ్రీమంతుల కథ ఆంధ్రా దర్పణంలో. నిజమైన విషయ పరిజ్ఞానం లేకుండా సగం సగం తెలివితేటలతో ప్రజల్ని రెచ్చగొట్టే వారందరికీ కనువిప్పు కలిగించేలా అర్ధజ్ఞాన రాజకీయులు ,ఇంకో ఎన్నో రాజ్య వర్గంలో మీ కోసం. నాటి చాణక్యుడు నేటి సమాజంలోని రాజకీయ పరిస్థితులను ఓ సామాన్యుడుగా ఎలా మారుస్తాడో అన్న అంశంతో శ్రీనివాస్ గోపిచంద్ దత్త గారి చణక్ ఆర్య సీరియల్ మీ కోసం.
గత సినీ వైభవాల్లో రక్త పన్నీరు నాగభూషణం గారి గురించి ప్రత్యేక కథనం, సినిహోరు లో పరిశోధన ఆధారిత సినిమాలు మీ కోసం సినిమా వర్గంలో.
ఒక ప్రయాణం జీవితమైతే,జీవనది సాహిత్యం. ఆలోచనలను అక్షరీకరిస్తూ ప్రతి పదంలో భావాన్ని ప్రస్పుటం చేస్తూ వారి వారి రచనలను అందిస్తున్న రచయితలకు, రచయిత్రులకు సమకాలిక సమాజ దర్పణాన్ని ఇస్తున్నవారికి మా ఆవిర్భవ టీం కృతజ్ఞతలని అందచేస్తోంది.